సీఎం జగన్‌ది ఎంత గొప్ప మనసో... సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. గంగిరెద్దు తల ఇనుప రాడ్డుకు తగలకుండా తన చేతిని అడ్డుపెట్టారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఒక్కొక్కటిగా సందర్శిస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్న క్రమంలో అక్కడే వున్న ఓ గంగిరెద్దును చూసి ఆగిపోయారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను దీవించాలని ఆ గంగిరెద్దును ఆడించే వ్యక్తి దాన్ని కోరాడు. దీంతో ఆ బసవన్న సీఎం జగన్‌ను ఆశీర్వదిస్తున్నట్లుగా తలను ఆడించింది. అయితే అక్కడ ఇనుప బారికేడ్ అడ్డుగా ఉండటం... దాని రాడ్డు బసవన్న తలకు తగిలే అవకాశం ఉండటంతో జగన్ తన చేతిని అడ్డుపెట్టారు. బసవన్న తలను పక్కకు జరిపి దానికి ఆ రాడ్డు తగలకుండా చేశారు. ఈ చర్యతో దాని కాపరి జగన్‌కు చేతులెత్తి నమస్కరించాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

viral video of cm jagan saves a bull from getting hurt

ఈ వీడియో చూసిన నెటిజన్లు జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జగన్‌ మనసు గొప్పదని పొగుడుతున్నారు. మూగజీవాల మీద జగన్‌కి ఉన్న ప్రేమను నెటిజన్లు అభినందిస్తున్నారు.

కాగా,గోపూజ మహోత్సవంలో హిందూ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు సీఎం జగన్.శుక్రవారం ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ముందుగా మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా టీటీడీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 2679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా సీఎం జగన్ గోపూజ మహోత్సవంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+