ఛీ.. తూ.. మీరు మనుషులేనా? తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడు పని..! వీడియో వైరల్

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం.. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందీ క్షేత్రం. ఏడు కొండలపై కలియుగ వేంకటేశ్వరుడు వెలసిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం దైవ సన్నిధిగానే భక్తులు భావిస్తుంటారు. కానీ ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఈ మధ్య కొందరు అపవిత్రం చేస్తున్న వార్తలు, వీడియోలు రావడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కోసం నిత్యం లక్షల మంది భక్తులు విచ్చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఆ దేవదేవుడి ఆశీస్సుల కోసం పరితపిస్తుంటారు. కానీ రాను రాను అంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రాన్ని కొందరు అపవిత్రం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలోనే మద్యం సేవిస్తూ.. ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.

Viral Video Sparks Outrage Alcohol Consumption at Tirumala Tirupati Temple

తిరుమలలో అపచారం జరిగింది అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి సన్నిధిలోనే మద్యం తాగుతున్న మందుబాబులు అంటూ నెట్టింట ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అక్కడే మద్యం తాగి.. ఆ ఖాళీ మందు బాటిళ్లను మెట్లపైకి విసిరేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ ఘటన తిరుమల శ్రీవారి సన్నిధిలో నిజంగానే జరిగిందా..? లేదా ఎవరైనా కావాలనే వైరల్ చేస్తున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు. మరికొందరు.. తిరుమల తిరుపతిలో భద్రత కట్టుదిట్టం చేయాలని సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+