viral video:అశోక్ సారు కొట్టలేదు -మంటల నుంచి కాపాడారు -టీడీపీ మహిళా కార్యకర్త వివరణ
విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఓ మహిళపై చేయిచేసుకున్నారనే ఘటనలో అసలు విషయం బయటికొచ్చింది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడం, ఆయన కేంద్ర మాజీ మంత్రి కూడా కావడంతో ఈ ఘటనకు జాతీయ మీడియా సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గడిచిన కొద్ది గంటలుగా 'మహిళపై అశోక్ జగపతి రాజు దాడి' వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, అక్కడ అసలేం జరిగిందో బాధిత మహిళ వివరణతో కూడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది..

బాలయ్య ఎఫెక్ట్‌తో..
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమాన నేత వచ్చారని గౌరవంతో ఓ మహిళ పువ్వులు చల్లి, హారతి ఇచ్చేందుకు ప్రయత్నించగా, సహనం కోల్పోయిన గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తను మెడలు వంచి కొట్టారంటూ ప్రచారం జరిగింది. రెండు రోజుల కిందట టీడీపీకే చెందిన నటుడు బాలకృష్ణ హిందూపురంలో ఓ అభిమానిని చెంపదెబ్బ కొట్టడం, దానికి పులకించిపోయానని బాధితుడు చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఆ నేపథ్యంలో నేటి అశోక్ గజపతి ఘటనపైనా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కానీ..

మహిళా కార్యకర్త హేమలత క్లారిటీ
అశోక్ గజపతిరాజుతో చెంపదెబ్బ తిన్నట్టుగా ప్రచారం జరిగిన టీడీపీ మహిళా కార్యకర్త హేమలత చెప్పిన విషయం వేరేలా వుంది. ఈ ఘటనపై ఆమె క్లారిటీతో కూడిన వీడియో కూడా మరోటి వచ్చింది. అశోక్ గజపతిరాజు చేయి చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని, తనకు ఆయన తండ్రి సమానులని హేమలత చెప్పారు. అభిమానంతో పదే పదే పూలు చల్లానని, అలా వద్దని వారించటానికి తన చేతిలో ఉన్న ప్లేటుపై అశోక్‌గజపతిరాజు కొట్టారని తెలిపారు. నిజానికి..
మంటల నుంచి కాపాడారు..
ప్రచారం సందర్భంగా తాను హారతి పళ్లెం పట్టుకుని నడుస్తున్నానని, నేత రాక సందర్భంగా పూలు చల్లగా, అవి హారతి పళ్లెంలో పడి మంటలు చెలరేగాయని, దాంతో అశోక్ గజపతిరాజు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారని టీడీపీ మహిళా కార్యకర్త హేమలత వివరించారు. అశోక్ గజపతిరాజు సకాలంలో స్పందించకపోయుంటే తన చీరకు మంటలు అంటుకునేవని తెలిపారు. వాస్తవం ఇదైతే ఈ ఘటనను కొంత మంది రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తున్నారని హేమలత తప్పుబట్టారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications