విశాఖ అమ్మాయి మృతి, ఆ రోజేం జరిగింది: వీడని చిక్కముడి

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: కృష్ణరాయపురానికి చెందిన విద్యార్థిని తనూజ మృతి కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె మృతి చెందిన రోజు రాత్రి ఏం జరిగింది అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె తల్లి మందలించడంతో శనివారం రాత్రి ఇంటి నుంచి వచ్చేసింది.

విశాఖ అమ్మాయి మృతిపై డౌట్స్: ప్రేమ వ్యవహారమా, ఏం జరిగింది?
వారి అపార్టుమెంటుకు 300 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించింది. ఈ మృతి పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. తల్లిదండ్రులను, ఇతరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Visakha girl Tanuja death a suicide or murder?

పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చిక్కుముడి వీడలేదు. విద్యార్థినిని తరుచూ వేధింపులకు గురి చేసిన విద్యార్థితో పాటు అతని మేనమామను పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది.

Visakha girl Tanuja death a suicide or murder?

కాగా, తనూజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. స్థానికులు ద్ద ఎత్తున తరలి వచ్చారు. నిందిలను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

Visakha girl Tanuja death a suicide or murder?

8వ తరగతి అమ్మాయి రేప్, హత్య: ఒంటిపై దుస్తులు లేకుండానే పడేశారు
ఇదిలా ఉండగా, బాలిక మృతికి కారకులైన నిందితులను ఎట్టి పరిస్థితిల్లో వదిలేది లేదని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే బండారు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విచారణ వేగవంతం చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Visakha girl Tanuja death a suicide or murder?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి