వందేభారత్ వేళల్లో మార్పు - ప్రయాణీకుల సహనానికి పరీక్ష..!!

వందేభారత్ ఇప్పుడు ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది. ఇతర రైళ్ల కంటే వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందనే కారణంతో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రయాణీకులు వందేభారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన రెండు వందేభారత్ రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది. విశాఖ - సికింద్రబాద్, తిరుపతి- సికింద్రాబాద్ వందేభారత్ రైళ్లు నిత్యం పూర్తి స్థాయి ప్రయాణీకులతో కొనసాగుతున్నాయి. ఇంత డిమాండ్ ఉన్న వందేభారత్ నిర్వహణ ప్రయాణీకుల ఆగ్రహానికి కారణమవుతోంది.

వందేభారత్ నిత్యం ఆలస్యం : వందేభారత్ ప్రారంభించిన తొలి రోజుల్లో వరుసగా రాళ్ల దాడులు జరిగాయి. ఆ తరువాత ప్రత్యేక చర్యలతో అవి ఆగిపోయాయి. వందేభారత్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు వేసవిలో రద్దీగా కనిపించే ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ఏసీ కోచ్ లు తగ్గించారు. గతంలో మూడు వరకు ఏసీ కోచ్ లు ఉన్న రైళ్లలో ఒక్కో కోచ్ కు పరిమితం చేసారు. వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఆ సమయకాల్లో ట్రాక్ క్లియర్ చేస్తూ ప్రముఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను లూప్ లైన్ లో పెడుతున్నారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వందేభారత్ కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. తిరుపతికి వెళ్లే ప్రయాణీకులు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తుండటం తో తాజాగా కోచ్ లు..సీట్ల సంఖ్యను రెట్టింపు చేసారు.

 vandebharathexpess1

ప్రయాణీకుల సహనానికి పరీక్ష : ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా వందేభారత్ తో ప్రయాణీకులకు సమస్యలు తప్పటం లేదు. కొద్ది రోజులుగా విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ నిత్యం గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణం సమయం వరకు రైల్వే అధికారులు రైలు ఆలస్యం పైన సమాచారం ఇవ్వటం లేదు. దీంతో ప్రయాణీకులు స్టేషన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఒడిశాలో రైలు ప్రమాదం తరువాత ఇదే తరహా పరిస్థితి ఎదురవుతోంది. ఆదివారం మినహా ప్రతీ రోజు ఉదయ 05:45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ - విశాఖపట్నం - సికింద్రాబాద్(20833) ఎక్స్‌ప్రెస్‌ ఏకంగా మూడు నుంచి నాలుగు గంటల ఆలస్యంగా నడుస్తోంది. అదే రైలు తిరిగి సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుకోవాల్సి ఉండగా..అర్ద్రరాత్రి తరువాత గమ్యస్థానికి చేరుకుంటోంది.

అర్ద్రరాత్రికి విశాఖకు : ఇతర రైళ్లతో పాటుగా వందేభారత్ గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రోజు ఉదయం బయల్దేరాల్సిన వందేభారత్ 4.45 గంటలు ఆలస్యంగా ప్రారంభం అవుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. వందేభారత్‌తో పాటు మరికొన్ని రైళ్లు ఆలస్యం కానున్నాయి. 112842 ఎం జీ అర్- చెన్నై సెంట్రల్-షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యం కానుంది. ఈ రైలు 07.00 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 10.30 గంటలకు బయలుదేరనుంది. దీంతో పాటు 12829 ఎం జీ అర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యం కానుంది. తిరుగు ప్రయాణంలోనూ ఆలస్యంతో అర్ద్రరాత్రికి విశాఖ చేరుకోనుంది. ఇలా రోజు ఇదే రకంగా జరుగుతున్న గంటల ఆలస్యం ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+