విశాఖ ఉక్కు ఉద్యమం ... గుంటూరు నుండి విశాఖకు పాదయాత్ర చేపట్టిన సామాజిక కార్యకర్త

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది. విశాఖ నగరం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అట్టుడుకుతోంది. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో కార్మికులు తమ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ పాదయాత్ర చేపట్టారు.

 విశాఖ ఉక్కు ను కాపాడుకోవడం కోసం సామాజిక కార్యకర్త పాదయాత్ర

విశాఖ ఉక్కు ను కాపాడుకోవడం కోసం సామాజిక కార్యకర్త పాదయాత్ర

విశాఖ ఉక్కు ను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు.విశాఖ ఉక్కు కోసం గతంలో 32 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అమృత రావు విగ్రహం వద్ద నుండి విశాఖ ఉక్కు కర్మాగారం వరకు పాదయాత్ర చేపట్టారు సామాజిక కార్యకర్త సురేష్. సామాజిక కార్యకర్త సురేష్ చేపట్టిన పాదయాత్రను మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ జెండా ఊపి ప్రారంభించారు.

400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన సామాజిక కార్యకర్త సురేష్

400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన సామాజిక కార్యకర్త సురేష్

రాష్ట్రంలోని యువత, రాష్ట్ర ప్రజలందరూ విశాఖ ఉక్కు ను కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని మాజీ ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన తెలపాలని పేర్కొన్న యలమంచిలి శివాజీ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

1930 మార్చి 12వ తేదీన ఉప్పు సత్యాగ్రహం చేసిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన స్ఫూర్తితో గుంటూరు నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ వరకు 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినట్లు సామాజిక కార్యకర్త సురేష్ తెలిపారు.

 విశాఖ ఉక్కు కోసం కొనసాగుతున్న ఆందోళన .. రాజకీయ పార్టీల విమర్శలు

విశాఖ ఉక్కు కోసం కొనసాగుతున్న ఆందోళన .. రాజకీయ పార్టీల విమర్శలు

ప్రైవేటీకరణ తో రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని, ప్రైవేటీకరణ కారణంగా కార్మికులు రోడ్డున పడతారని, భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు కూడా లేకుండా పోతాయని సురేష్ అంటున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం సాగుతున్న ఉద్యమంలో నేను సైతం అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

ఇక మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ పార్టీల నాయకులు ఒకరి మీద అఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు . విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం మీదంటే మీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+