విశాఖలో వైసీపీకి భారీ షాక్
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో దారుణ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కార్యకర్తలకు, పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. ఓడిపోయిన పార్టీలో ఉండటం ఎందుకనుకుంటున్నారో లేదా, జగన్‌తో కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ, వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఒకొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

నటుడు అలీ సైతం వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ఓడిపోవడంతో చాలామంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖపట్నంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి చేరికలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా వైసీపీ మనకు శత్రువు కాదు.. కానీ, వైసీపీ విధానాలతోనే జనసేన విభేధిస్తోందన్నారు.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. రాజకీయంగా, అన్ని రకాలుగా జనసేన నేతలు, కార్యకర్తలు ఎదగాలనే నేను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నానని పవన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications