సర్వే షాక్: ప్రమాణాల్లో దేశంలోనే చివరన విశాఖ ఎయిర్‌పోర్ట్

ఉన్నత ప్రమాణాలను పాటించడంలో విఫలం కావడంతో విశాఖపట్నం విమానాశ్రయం దేశంలోని 17 విమానాశ్రయాల్లో చివరన నిలిచింది.

Recommended Video

    Visakhapatnam Airport Stands Last In National Survey | Oneindia Telugu

    విశాఖపట్నం: ఉన్నత ప్రమాణాలను పాటించడంలో విఫలం కావడంతో విశాఖపట్నం విమానాశ్రయం దేశంలోని 17 విమానాశ్రయాల్లో చివరన నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తరపున ఆఫ్ ది గ్లోబల్ బాడీ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్స్, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) నిర్వహించిన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ సర్వేలో ఈ విషయం తేలింది.

    ఉన్నత ప్రమాణాలను పాటించడంలో విశాఖపట్నం విమానాశ్రయానికి అత్యంత తక్కువ మార్కులే పడ్డాయి. జనవరి-మార్చిలో 4.04 స్కోరు చేయగా, ఏప్రిల్-జూన్‌లో 4.17, ఆగస్ట్-అక్టోబర్‌లో 3.97కు పడిపోయింది. విశాఖపట్నం కంటే మిగితా ఎయిర్‌పోర్టులు మెరుగ్గా స్కోరు చేయడం గమనార్హం.

    Visakhapatnam airport stands last in national survey

    వాష్ రూమ్స్, ఎయిర్ పోర్ట్ టెర్మినల్స్‌లో శుభ్రత కూడా అంతంత మాత్రంగానే ఉందని ఈ సర్వేలో తేలింది. మూడో శుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకున్న విశాఖ.. ఈ విషయంలో మాత్రం వెనకబడి పోయింది. అంతేగాక, ఈ నగరంలోని రైల్వే స్టేషన్‌ పరిశుభ్రంగా ఉండటం గమనార్హం.

    పార్కింగ్ సౌకర్యం, వాల్యూ ఫర్ మనీ ఆఫ్ పార్కింగ్ ఫెసిలిటీ, రెస్టారెంట్/ఆహార పదార్థాల లభ్యత/ బ్యాగేజీ, కార్ట్స్, ట్రాలీస్ లభ్యత, క్యూలో వెయిటింగ్ టైమ్, స్టాఫ్ కర్టసీ, సిబ్బంది సహాయక చర్యలు, పాస్ పోర్ట్/ఐడీ తనిఖీ వెయిటింగ్ టైమ్ తదితర విషయాల్లో విశాఖ విమానాశ్రయం చాలా వెనకబడి ఉందని సర్వే తేల్చింది. మొత్తం 33అంశాల్లో దాదాపు 23 అంశాల్లో విశాఖ విమానాశ్రయం నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని తేలింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+