ముస్తాబవుతోన్న విశాఖ- డిన్నర్ ఇవ్వనున్న జగన్: అన్నీ తానైన ఐఎఎస్ శ్రీలక్ష్మీ..!!

సాగరనగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తోంది. దీనికోసం ముస్తాబవుతోంది. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ భేటీ ఏర్పాటు కానుంది.

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తోంది. దీనికోసం ముస్తాబవుతోంది. ఇటీవలే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటయిందిక్కడ. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు దేశీయ పారిశ్రామికదిగ్గజాలు హాజరయ్యాయి. ఏపీలో పెట్టబడులను ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నాయి. వీటి విలువ సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు అప్పట్లో.

జీ20 వర్కింగ్ గ్రూప్ సమ్మిట్..

జీ20 వర్కింగ్ గ్రూప్ సమ్మిట్..

ఇక తాజాగా- విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు కాబోతోంది. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ భేటీ జరుగనుంది. అదే- జీ20 సదస్సు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అత్యున్నత స్థాయి సమ్మిట్ ఇది. ఇందులో కీలకమైన ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నంలో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ దేశాలకు చెందిన జీ20 వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నానికి రాబోతోన్నారు.

సుందరంగా..

సుందరంగా..

ఈ భేటీ కోసం విశాఖపట్నం ముస్తాబవుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా అధికార యంత్రాంగం.. ఆయా పనులన్నింటినీ వేగవంతం చేస్తోంది. విశాఖలో అన్ని ప్రధాన మార్గాల్లో కొత్త రోడ్లను వేశారు. జీ20 లోగోలను అమర్చారు. ఐ లవ్ వైజాగ్ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలతో ప్రధాన మార్గాలన్నింటినీ అధికారులు అలంకరించనున్నారు. మామూలుగానే అందంగా కనిపించే వైజాగ్- తాజా చర్యలతో మరింత అందంగా మారింది.

27న జగన్..

27న జగన్..

ఈ సదస్సును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. దీనికోసం ఆయన 27 సాయంత్రం లేదా 28వ తేదీన ఉదయం విశాఖపట్నానికి రానున్నారు. 28వ తేదీన రాత్రి- జీ20 వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యుల గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. 29వ తేదీన సమావేశం ముగిసిన తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. 30వ తేదీన విశాఖపట్నంలో వారు పర్యటిస్తారు. పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు.

అన్నీ తానైన శ్రీలక్ష్మీ..

అన్నీ తానైన శ్రీలక్ష్మీ..

ఈ సదస్సు ఏర్పాట్లన్నింటినీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మీ పర్యవేక్షిస్తోన్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ పీ రాజాబాబు, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆమె పలుమార్లు ఈ సదస్సు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

సెప్టెంబర్ లో..

సెప్టెంబర్ లో..

ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+