నుదిటిన బొట్టు తీసేసి "అల్లాహా్ అక్బర్" అని వేడుకున్నాం..అయినా కూడా వదలలేదు..!
పహల్గాం ఉగ్రదాడితో కళ్లముందే తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఆ భయానక దృశ్యాలను తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కుటుంబంతో హాయిగా కాశ్మీర్ అందాలను చూసొద్దామని వెళ్లిన తమకు దేవుడు మోయలేని శిక్ష విధించాడని రోదిస్తున్నారు. ఉగ్రమూకల మారణహోమంలో మృతి చెందిన ఏ కుటుంబాన్ని కదిపినా కంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అలాంటి కథే విశాఖ వాసి చంద్రమౌళిది కూడా. ఆయన మరణాన్ని కళ్లముందే చూసిన ఆయన బంధువులు ఏం చెప్పారు?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నానికి చెందిన జేఎస్ చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఆయన భౌతిక కాయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నివాళులు అర్పించారు. అయితే ఉగ్రవాదులు తమను చుట్టుముట్టినప్పుడు జరిగిన భయానక దృశ్యాలను అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

'నుదిటిన బొట్టు ఉంటే హిందువులం అని.. మమ్మల్ని చంపేస్తారని అక్కడ చెరువులోని నీటితో మా ముఖాలు కడిగేసుకున్నాం. అల్లాహ్ నామం జపించాం. తుపాకీ కాల్పులకు గుండె అదిరింది. చంపేస్తారేమో అని అనుకున్నాం. అని పహల్గాం దాడిలో ప్రాణాలతో బయటపడిన విశాఖకు చెందిన సుచిత్ర ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చంద్రమౌళి కుటుంబంతో పాటు శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరారు. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

చంద్రమౌళిని కాల్చినప్పుడు..
చంద్రమౌళిని ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పటి దృశ్యాలను శశిధర్ భార్య సుచిత్ర వెల్లడించారు. 'ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టగానే భయపడి టాయిలెట్స్ వెనుక దాక్కున్నాం. అక్కడ ఓ వ్యక్తి అక్కడున్న ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోవడం గమనించాం. అలా చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని భావించాం. నాకు ఫెన్సింగ్ కింద నుంచి రావడం తెలియకపోతే చంద్రమౌళినే సహాయం చేశారు. ఆ తర్వాత ఆయనొక వైపు, మేం మరో వైపు పరిగెత్తాం. చంద్రమౌళిని ఉగ్రవాదులు చుట్టుముట్టినప్పుడు నేను సమీపంలోనే ఉన్నాను. కానీ తలతిప్పే ధైర్యం చేయలేదు. అప్పుడే చంద్రమౌళిని కాల్చేశారు. ఆయన్ను చూస్తే పడుకుండిపోయినట్లు కనిపించారు. ఉగ్రవాదులకు భయపడి ఆయన అలా చేశారేమో అనుకున్నా. కానీ తుపాకీ కాల్చినప్పుడు బుల్లెట్ ధాటికి చెట్టు బెరడు విరిగి మా వైపు దూసుకొచ్చింది' అని సుచిత్ర కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ టూర్ ప్లాన్ చేసింది చంద్రమౌళినేనని చెప్తూ అందరూ విలపించారు.కాశ్మీర్‌కు వెళ్లిన ఆరుగురిలో ఒకరి ప్రాణాలను అక్కడే వదిలేసి వచ్చేశామని.. ఇది జీర్ణించుకోలేక పోతున్నామని సుచిత్ర, ఆమె భర్త శశిధర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకోగా. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. వాళ్లు శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని ప్రస్తుతం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచారు. ఇద్దరు కుమార్తెలు వచ్చాక శుక్రవారం(ఏప్రిల్ 25) ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి బంధువులు తెలిపారు.
మరోవైపు చంద్రమౌళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి చంద్రమౌళి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications