జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఊహించని ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు సమాచారం. అంతే కాకుండా తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే చనిపోయిన వారిలో విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తిని రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ చంద్రమౌళిగా గుర్తించారు.

విశాఖపట్నం వాసి, విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్ట్‌లు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు.

visakhapatnam-resident-dies-in-jammu-and-kashmir-terror-attack

విశాఖ లోని రంగపురం నకు చెందిన మూడు కుటుంబాలు కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. చంద్రమౌళి, ఆయన భార్యతో పాటు.. మరో రెండు జంటలు కలిసి ఈ నెల 18న టూర్‌కు బయల్దేరారు. అయితే చంద్రమౌళి జంట ఉన్న ప్రాంతంలో ముష్కరులు కాల్పులకు తెగబడడంతో.. ముందుగా ఆయన కనిపించకుండా పోయినట్టు భావించారు. చంద్రమౌళి కోసం మిగిలిన ఐదుగురు గాలింపు చేపట్టారు. అయితే చివరకు చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు సమాచారం. పారిపోతున్న చంద్రమౌళిని టెర్రరిస్టులు వెంటాడి విచక్షణారహితంగా కాల్చి చంపినట్టు సహచర టూరిస్టులు వాపోతున్నారు.

మరోవైపు ఈ ఉగ్రదాడిలో భార్య, కుమారుడితో కలిసి విహారయాత్రకు వెళ్లిన కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ రావును వారి కళ్ల ముందే కాల్చి చంపారు. అలానే దుండగుల్లో ఒకరు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తన భర్తను కాల్చి చంపారని ఆమె వాపోతుంది. అలానే ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారిని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన భార్యతో కలిసి కాశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

మరోవైపు ఈ కిరాతక దాడి అనంతరం భారత సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బైసరాన్, పహల్గామ్, అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో సంయుక్తంగా భారీ గాలింపు ఆపరేషన్‌ను ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని.. వారిని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టడమే లక్ష్యమని చెబుతున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+