మణిపూర్‌లో విశాఖ జవాన్ వీరమరణం

హైదరాబాద్: తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో విశాఖ జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ మజ్జి శంకరరావు (25) మృతిచెందారు. మణిపూర్ రాష్ట్ర సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి.

మజ్జి శంకరరావు 2010లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మణిపూర్‌ రాష్ట్ర సరిహద్దుల్లో తన విధులను నిర్వహిస్తున్నారు. మద్రాసు రెజిమెంట్‌ బ్రేవో కంపెనీలో సిపాయిగా ఉన్న శంకర్‌రావు విధినిర్వహణలో ఉండగా తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించినట్టు ఆయన కుటుంబసభ్యులకు ఇండియన్ ఆర్మీ సమాచారం అందించింది.

Visakhapatnam soldier killed in Manipur ambush

ఈ మరణవార్త వినగానే అతడి తల్లిదండ్రులు దుఃఖంతో కుప్పకూలిపోయారు. ఇది ఇలా ఉంటే శంకరరావుకు అతడి అక్క కూతురితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. మరో ఆరు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు.

కాగా, శంకరరావు మృతదేహాం బుధవారం లేదా గురువారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉందని బంధువులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+