మారుమూలన ఉన్న సాలూరును కరుణించిన నరేంద్రమోడీ
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరుపై కేంద్రం కరుణించింది. గతంలో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు సాలూరులో బ్రిటీష్ వారు రైల్వేస్టేషన్ ఏర్పాటు చేసి రైలుబండిని నడిపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్నాళ్లు నడిచిన ఆ రైలు బండి ఆగిపోయింది. ఈ స్టేషన్ మీదుగా రైళ్లు నడుస్తున్న సమయంలో దేశ, విదేశాలకు సాలూరు నుంచి గోధుమలు, సిమెంటు, బియ్యంతోపాటు ఇతర వస్తువులు సరఫరా అయ్యేవి. కాలక్రమేణా ఈ స్టేషన్ మూతపడింది. దీంతో సరకు రవాణా ఆగిపోయింది. అప్పటి నుంచి స్థానికులు రైలుబండిని నడిపించాలంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
సాలూరు వరకు పొడిగింపు
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు నడుస్తున్న మెము రైలును సాలూరు వరకు పొడిగించారు. ఈమేరకు గత నెలలోనే విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ రైలు నెంబర్లు 07468, 07467, 67292, 67291 ఇవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నడుస్తున్న రైలు బళ్లు ఇక్కడ నష్టాలు వస్తున్నాయని సేవలను ఆపేశారు. కనీసం ఒక బోగీతోనైనా నడిపించాలని కోరడంతో 2004లో రైలు బస్సు సేవలను ప్రారంభించారు. సాలూరు-బొబ్బిలి మధ్య ఇది నడిచేది.

విజయవాడ వరకు పొడిగించాలి
సాలూరు నుంచి పార్వతీపురం, రాయగడ, అలాగే మరో మార్గంలో సాలూరు నుంచి విజయవాడకు రైలు సేవలు అందించాలని స్థానికులు కోరుతూ వస్తున్నారు. దీంతో కొంతకాలం తర్వాత దండిగాం రోడ్డు వరకు ఈ రైలు పొడిగించారు. స్టేషన్ ను ఆధునికీకరించడంతోపాటు ఇతర మౌలిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తుఫాను, ఈదురుగాలులతో ట్రాక్ దెబ్బతినడంతో మరమ్మతులు నిర్వహించారు. తాజాగా రైల్వేబోర్డు అనుమతులు జారీచేయడంతో మెము రైలు నడవడానికి మార్గం సుగమమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ కల నెరవేరడంతో స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications