విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏఎస్పీ అనుమానాస్పద మృతి: మిన్నంటిన రోదనలు, సూసైడ్ లేఖలో ఏముంది?(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జిల్లాలోని పాడేరు ఏఎస్పీ కె శశికుమార్ (28) గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో తలపై కుడిభాగాన చెవి వద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎఎస్పీ ఆత్మహత్య ఘటన విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం గ్రామానికి చెందిన ఆయన 2012 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఐపిఎస్ శిక్షణ అనంతరం కర్నూలు జిల్లా ఆళ్లగెడ్డ ఏఎస్పీగా తొలిసారి విధుల్లో చేరిన శశికుమార్ ఈ సంవత్సరం జనవరి 6న పాడేరుకు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు.

ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల వ్యవధిలో ఇలా జరగడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా భావిస్తున్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందో స్పష్టంగా తెలియరాలేదు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడమే కాకుండా ఎఎస్పీ ఆత్మహత్యపై ఎటువంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సంఘటన ప్రదేశానికి మీడియాను సైతం అనుమతించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో శశికుమార్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్టు తెలుస్తోంది. తల కుడిభాగాన కాల్చుకోవడంతో బుల్లెట్ ఎడమ భాగం నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న గోడకు తగలడంతో గోడకు రంధ్రం ఏర్పడినట్టు చెబుతున్నారు.

రివాల్వర్ శబ్దం విని బయట ఉన్న గన్‌మెన్‌లు లోపలికి వెళ్లి చూసేసరికి శశికుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్‌ఐ సూర్యప్రకాష్ ఎఎస్పీని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఏఎస్పీ ఇంటిలోపలకు ఎస్‌ఐ వెళ్లే సరికి అక్కడ ఉన్న సూసైడ్ నోట్‌ను ఆయన స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు చేరవేసినట్టు తెలియవచ్చింది. సూసైడ్ నోట్‌లో ఆయన ఏం రాశారు? ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయాలను పోలీసు అధికారులు రహస్యంగా ఉంచారు.

ఏఎస్పీ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పాడేరు ఐటిడిఎ పిఒ ఎం హరినారాయణన్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శశికుమార్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో విశాఖపట్నం తరలించారు.

మృతదేహం వెంట అంబులెన్స్‌లో ఐటిడిఎ పిఒ కూడా విశాఖపట్నం వెళ్లారు. శశికుమార్ మృతదేహాన్ని విశాఖపట్నం నుంచి ఆయన స్వస్థలమైన తమిళనాడులోని సత్యమంగళం గ్రామానికి తరలించి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఎవరూ బాధ్యులు కారు: ఆత్మహత్య లేఖలో ఏఎస్పీ

'నా మరణానికి ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు' అని గురువారం మృతిచెందిన పాడేరు ఏఎస్పీ శశికుమార్‌ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం శుక్రవారం ఆయన కార్యాలయంలో తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా శశికుమార్‌ రాసిన ఆత్మహత్య లేఖ, తుపాకీ, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

'నా చావుకు ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా' అని లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, అంతకుముందు ఏఎస్పీ గొంతులో బంతి లాంటి ఏదో వస్తువు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎవరైనా అతని చాంబర్లోకి వచ్చి చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తమమయ్యాయి.

వివాహం చేయాలని నిశ్చయించిన తల్లిదండ్రులు: అంతలోనే..

విషాద వార్త తెలియగానే సోదరి కవిత తన భర్త పద్మనాభన్‌తో కలిసి చెన్నై నుంచి విశాఖ వచ్చారు. సాయంత్రానికి తల్లిదండ్రులు చేరుకున్నారు. కారు దిగుతూనే తల్లి మైలమ్మల్ బాధతో ముందుకు కదలలేకపోయారు. అతికష్టం మీద మార్చురీ వద్దకు వెళ్లిన ఆమె నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి కళ్లుతిరిగి పడిపోయారు. మరో రెండు నెలల్లో ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంతలో ఇలా జరగడం వారిని తీవ్రంగా కలచివేసింది.

విధుల్లో నిబద్ధత

శశికుమార్ ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలపై కఠినంగా వ్యవహరించారని పేరుంది. బదిలీపై పాడేరుకు వచ్చినప్పటి నుంచి ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై దృష్టి సారించారు. భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల అరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై కూడా రెండు రోజుల క్రితం కొత్తభల్లుగుడ గ్రామం వెళ్ళి విచారణ నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో, పాడేరులోని తన కార్యాలయంలో పని చేసే ఉద్యోగులతో కూడా ఆయన ఎంతో సామరస్యంగానే మెలిగేవారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం డిపార్ట్‌మెంట్‌ను కలచివేస్తోంది.

చంద్రబాబు సంతాపం

శశికుమార్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్పీ మరణ వార్త విన్న వెంటనే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని విశాఖ బయలుదేరారు. కేజీహెచ్‌లో ఉంచిన శశికుమార్మృతదేహాన్ని సందర్శించనున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఏఎస్పీ శశికుమార్ (ఫైల్)

ఏఎస్పీ శశికుమార్ (ఫైల్)

విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఏస్పీ కె శశికుమార్ (28) గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కుటుంబసభ్యుల రోదనలు

కుటుంబసభ్యుల రోదనలు

తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో తలపై కుడిభాగాన చెవి వద్ద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎఎస్పీ ఆత్మహత్య ఘటన విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.

కుటుంబసభ్యుల రోదనలు

కుటుంబసభ్యుల రోదనలు

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం గ్రామానికి చెందిన ఆయన 2012 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఐపిఎస్ శిక్షణ అనంతరం కర్నూలు జిల్లా ఆళ్లగెడ్డ ఏఎస్పీగా తొలిసారి విధుల్లో చేరిన శశికుమార్ ఈ సంవత్సరం జనవరి 6న పాడేరుకు ఏఎస్పీగా బదిలీపై వచ్చారు.

సొమ్మసిల్లిపడిపోయిన శశికుమార్ తల్లి

సొమ్మసిల్లిపడిపోయిన శశికుమార్ తల్లి

ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల వ్యవధిలో ఇలా జరగడం వెనుక బలమైన కారణం ఉన్నట్టుగా భావిస్తున్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందో స్పష్టంగా తెలియరాలేదు.

 ఏఎస్పీ అనుమానాస్పద మృతి: మిన్నంటిన రోదనలు, ఏం జరిగింది?

ఏఎస్పీ అనుమానాస్పద మృతి: మిన్నంటిన రోదనలు, ఏం జరిగింది?

సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసు అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడమే కాకుండా ఎఎస్పీ ఆత్మహత్యపై ఎటువంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మృతదేహాన్ని చూసి రోదనలు

మృతదేహాన్ని చూసి రోదనలు

సంఘటన ప్రదేశానికి మీడియాను సైతం అనుమతించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల ప్రాంతంలో శశికుమార్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్టు తెలుస్తోంది.

మృతదేహాన్ని చూసి రోదనలు

మృతదేహాన్ని చూసి రోదనలు

తల కుడిభాగాన కాల్చుకోవడంతో బుల్లెట్ ఎడమ భాగం నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న గోడకు తగలడంతో గోడకు రంధ్రం ఏర్పడినట్టు చెబుతున్నారు.

సంతాపం

సంతాపం

రివాల్వర్ శబ్దం విని బయట ఉన్న గన్‌మెన్‌లు లోపలికి వెళ్లి చూసేసరికి శశికుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్‌ఐ సూర్యప్రకాష్ ఎఎస్పీని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబసభ్యులకు పరామర్శ

కుటుంబసభ్యులకు పరామర్శ

అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఏఎస్పీ ఇంటిలోపలకు ఎస్‌ఐ వెళ్లే సరికి అక్కడ ఉన్న సూసైడ్ నోట్‌ను ఆయన స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు చేరవేసినట్టు తెలియవచ్చింది.

కుటుంబసభ్యులకు పరామర్శ

కుటుంబసభ్యులకు పరామర్శ

సూసైడ్ నోట్‌లో ఆయన ఏం రాశారు? ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయాలను పోలీసు అధికారులు రహస్యంగా ఉంచారు.

English summary
A young IPS officer allegedly committed suicide by shooting himself with his service revolver at his residence cum office at Paderu in Vizag Agency on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X