వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశ్నలతో పురంధేశ్వరి ఉక్కిరి బిక్కిరి, రైల్వే జోన్‌పై అవంతి ఆసక్తికరం

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. బుధవారం మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎంపీలు హరిబాబులు రైల్వే జోన్ అంశంపై స్పందించారు. టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఆసక్తికరంగా స్పందించారు.

విశాఖ బదులు బెజవాడ: రైల్వేజోన్‌పై కేంద్రం మెలిక, అందుకే!

రైల్వే జోన్ ఎక్కడ వచ్చినా అభ్యంతరం లేదని ఎంపీ హరిబాబు చెప్పారు. అయితే, విశాఖకు రైల్వే జోన్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైల్వే జోన్ కోసం ప్రయత్నిస్తున్నామని విష్ణు కుమార్ రాజు అన్నారు.

ఈ సందర్భంగా మీడియా పురంధేశ్వరి పైన ప్రశ్నల వర్షం కురిపించింది. హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు మరచిపోతున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఆమె సూటిగా సమాధానం చెప్పలేక పోయారు.

Vishaka railway zone: Purandeswari confused with media questions!

హోదాపై తిరుపతిలో నాడు ప్రకటన చేయలేదా? ఆర్థిక సంఘం సిఫార్సులతోనే మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇచ్చారా? ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది? విశాఖపట్నానికి ఇవ్వాల్సిన రైల్వే జోన్‌ను విజయవాడకు ఎందుకు తరలిస్తున్నారు? ఎంత సెంటిమెంట్ ఉంటే మేమిలా మిమ్మల్ని అడుగుతాం? ప్రజల తరఫునే ఈ ప్రశ్నలు వేస్తున్నామని విలేకరులు అడిగారు.

దానికి పురంధేశ్వరి.. నవ్వుతూనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనకూ హోదాపై సెంటిమెంట్ ఉందని, ప్రజలను ఆందోళనపరిచే రాతలు, వ్యాఖ్యలు వద్దని, హోదా అన్న పదం లేకుండా అందుకు సమానమైన న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

బాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!

తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖకు కాకుండా విజయవాడకు రైల్వే జోన్ వస్తుందన్న అంశంపై స్పందించారు. విజయవాడలో ఏపీలో భాగమే కదా అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రవాసిగా రైల్వే జోన్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఐనా కేంద్రం ప్రకటన తర్వాత స్పందిస్తానన్నారు.

English summary
Former Union Minister Purandeswari confused with media questions!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X