ఇంట్లో మద్యం పెట్టుకోనీయరా - విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలతో..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. బడ్జెట్ పైన సభలో చర్చ జరుగుతోంది. వైసీపీ గైర్హాజరు కావటంతో కూటమి పార్టీల సభ్యులే చర్చలో పాల్గొన్నారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తన ప్రసంగంలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వ్యంగ్యాన్ని జోడించి తాను చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పటం విష్ణు కుమార్ రాజు ప్రత్యేకత. మద్యం అంశం పైన మాట్లాడుతూ విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలతో సభలో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది.

మద్యం అంశం పైన సభలో విష్ణు కుమార్ రాజు స్పందించారు. తన ప్రసంగంలో మద్యం పాలసీ ప్రకారం ఇంట్లో ఆరు బాటిళ్ల వరకు ఇంట్లో ఉంచుకొనే అవకాశం ఉందని గుర్తు చేసారు. గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేస్తారని తాము అసలు ఇంట్లో ఉందచుకోలేదని వ్యాఖ్యానించారు. మంచి మద్యం అక్కడా ఇక్కడా తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్ళు ఇంట్లో పెట్టుకొని.. మిగలినవి దాచిపెట్టమని ప్రెండ్స్‌కు ఇచ్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. అయితే వారు తమకు గిప్ట్‌గా ఇచ్చారనుకొని ఖాళీ చేసేసే వారంటూ విష్ణు కుమార్ రాజు చెప్పటంతో ఒక్క సారిగా సభలో నవ్వులు పూసాయి.

Vishnu Kumar raju appeal for Government over liquor bottles permission for houses

ఇంట్లో మద్యం పరిమితుల అంశం పైన విష్ణు కుమార్ రాజు ఇది చాలా పెద్ద సమస్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ బిజినెస్ హౌస్ లకు అయినా ఈ కోటా పెంచాలని కోరారు. సభలో చెబితే బాగోదంటూనే విష్ణు కుమార్ రాజు తాను చెప్పదలచుకున్నది చెప్పేసారు. ఇక, బడ్జెట్ పైన ప్రసంగంలో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్లు నుంచి వచ్చే ఆదాయం రూ.4000 కోట్లు పెంచి చూపించటం పైన ప్రశ్నించారు. అంత ఆదాయం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రూ.25,595 కోట్లు ఎక్సైజ్ ద్వారా వస్తుందని చెప్పారని గుర్తు చేసారు. అంత వస్తుందా అంటూ సందేహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతి చేసిందని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+