వారు మారరు!: విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన విష్ణు కుమార్ రాజు
అమరావతి: ఐఏఎస్ అధికారులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
విధి నిర్వహణలో భాగంగా అధికారులు తమ విధులను నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వాలు మారుతాయని, అధికారులు మాత్రం మారరు అన్నారు. వారి పని వారు చేస్తుంటారన్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని సూచించారు.

ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఖండించింది. తాము అధికారంలోకి వస్తే సతీశ్ చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతా రాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications