వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుపై మనసులో మాట: చంద్రబాబుకు సన్నిహిత బిజెపి నేత విష్ణు షాక్

టిడిపి అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతాడని భావించే బిజెపి నేత, ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు శుక్రవారం షాకింగ్ కామెంట్స్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతాడని భావించే బిజెపి నేత, ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు శుక్రవారం షాకింగ్ కామెంట్స్ చేశారు.

చదవండి: చంద్రబాబుకు పురంధేశ్వరి సూటి ప్రశ్న

లీవ్ టిడిపి, సేవ్ బిజెపి అని కార్యకర్తలు ప్రదర్శించడం ద్వారా తమ మనసులోని మాటను కూడా చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బిజెపిలోని పలువురు నేతలు టిడిపికి దూరం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్యకర్తలు మనసులో మాట చెప్పారు

కార్యకర్తలు మనసులో మాట చెప్పారు

ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాడని భావించే విష్ణు కుమార్ రాజు కూడా కార్యకర్తలు తమ మనసులోని మాటలు చెప్పారని వ్యాఖ్యానించడం గమనార్హం. శాసన సభ జరుగుతున్న సమయంలో చంద్రబాబును ఆయన పలుమార్లు డిఫెండ్ చేశారు. అయితే కొన్నిసార్లు పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై స్పందిస్తూ.. తాను సీఎంను అయితే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేవాడినన్నారు.

అనుకోని సంఘటనలు

అనుకోని సంఘటనలు

కాగా, బిజెపి పోలింగ్‌ బూత్‌ కార్యకర్తల మహా సమ్మేళనంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వెంకయ్య నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు టిడిపితో పొత్తు వద్దంటూ నినాదాలు చేశారు.

బిజెపి సీఎం అంటూ..

బిజెపి సీఎం అంటూ..

లీవ్‌ టిడిపి.. సేవ్‌ బిజెపి, వియ్ వాంట్‌ బిజెపి సీఎం.. అంటూ ఫ్లకార్డులను చూపుతూ నినదించారు. వెంకయ్య నాయుడు అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

ఎమ్మార్పీఎస్ ఆందోళన

ఎమ్మార్పీఎస్ ఆందోళన

అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు జెండాలు, బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణ వంద రోజుల్లో చేస్తామని చెప్పి, చేయలేదంటూ నినాదాలు చేశారు.

English summary
BJPLP Vishnu Kumar Raju hot comments on Telugudesam alliance on Friday. He responded on leave TDP and Save BJP slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X