ముఖ్యమంత్రిని నిలదీశాకే: బాబుపై బిజెపి విష్ణు సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిజెపి నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్నారు. విష్ణు కుమార్ కొన్ని సందర్భాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజాగా, ఆదివారం ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే ఆ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలపై ప్రచారం చేసుకోవడంలో బిజెపి నేతలు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగింది
చంద్రన్న బీమా పథకం పేరును ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకంగా మార్చిన అంశంపై విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర అరోగ్య శాఖల మంత్రులు చంద్రబాబుతో భేటీ అయ్యారని, ఆ సందర్భంలో చంద్రన్న బీమా పథకంపై చర్చ జరిగిందన్నారు.

చంద్రబాబును నిలదీశా
ఆ చర్చలో కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రన్న పేరు పెట్టుకోవడం ఏమిటని తాను నిలదీశానని విష్ణు కుమార్ రాజు చెప్పారు. దీంతో ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకంగా పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

మొదటి నుంచి బిజెపి నేతల అసంతృప్తి
కాగా, రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని, వాటికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుంటుందని బిజెపి నేతలు మొదటి నుంచి ఆవేదనతో ఉన్నారు. వీటికి కేంద్రం నిధులు ఇస్తోందనే విషయాన్ని మనం బలంగా తీసుకెళ్లలేకపోతున్నామని వారు కూడా అంగీకరిస్తున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications