5 లక్షల కోట్ల నష్టం: వివేక్, రేపు మళ్లీ టాస్క్‌ఫోర్స్ భేటీ
హైదరాబాద్: నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ ప్రాంతానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ మంగళవారం అన్నారు. నీటి కేటాయింపులపై జరిగిన అన్యాయంపై తాము మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదిక ఇస్తామని చెప్పారు.
కృష్ణా జల్లా కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగినందున తమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్న సీమ నేతలు కృష్ణా జలాలను అక్రమంగా మళ్లించుకున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపుల వల్ల తమ ప్రాంతానికి భారీ నష్టం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు అబద్దాలకోరులన్నారు. తప్పుడు సంకేతాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ముగిసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షణా సంస్థ కార్యాలయంలో భేటీ అయిన టాస్క్‌ఫోర్స్ బృందం సమావేశం ముగిసింది. బుధవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం భేటీ అయిన టాస్క్‌ఫోర్స్ ప్రాథమికంగా పలు అంశాలపై చర్చించింది. విభజన తర్వాత పోలీసు శాఖను విభజించే అంశంపై చర్చించింది.












Click it and Unblock the Notifications