తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె : ఏమని ఫిర్యాదు చేసారంటే..!
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని..కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన సునీత ఇప్పుడు తెలంగాణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. సునీత వరుసగా చేస్తున్న ఈ ఫిర్యాదులు ఆసక్తి కరంగా మారాయి.
తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు..
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనర్ ను కలిసారు. ఇప్పటికే తన తండ్రి మరణం మీద రాజకీయ నేతలు విచారణ సంస్థల పై ప్రభావం పడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సునీత ఆందోళన వ్య క్తం చేసారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని..నిష్ఫక్షపాత విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్ర ధానాధికారి ని కలిసారు.

ఇక, వివేకా మృతి పై మూడో సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని.. హోం శాఖ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసారు. ఇక, తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ కలిసి మరో విజ్ఞప్తి చేసారు సునీత. ఈ ఫిర్యాదు ను నేరుగా సజ్జనార్ కు అందచేసారు.

సోషల్ మీడియా ను నియంత్రించండి..
సైబరాబాద్ కమిషనర్ ను కలిసిన సునీత తన తండ్రి గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం పై ఆవేదన వ్యక్తం చేసారు. తన తండ్రి మరణించిన బాధలో తాము ఉంటే ఆయన మరణం గురించి ఇష్టానుసారం పోస్టులు పెడు తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయంగా పార్టీల పరంగా పోస్టులు పెట్టి మరణించిన వ్యక్తిని కించపరుస్తున్నా రని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటువంటి పోస్టింగ్స్ పెడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని..ఇటువంటి పోస్టింగ్స్ పెట్టకుండా చూడాలని విజ్క్షప్తి చేసారు. తాము తప్పకుండా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications