వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలుత చూసింది వారే - సీబీఐకి వివేకా టైపిస్టు వాంగ్మూలం : వెలుగులోకి మరిన్ని అంశాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకా ఎపిసోడ్ లో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన సుదీర్ఘంగా పలువురిని విచారించిన సీబీఐ అనేక అంశాల పైన ఆరా తీసింది. తాజాగా.. వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి వచ్చిన వాంగ్మూలం వెలుగు చూసింది. గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ప్రధానంగా వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లోకి అవినాశ్.. దేవిరెడ్డి శంకరెడ్డిలే వెళ్లారని ఆయన వెల్లడించారు. ఆ తరువాతనే మిగిలినవారు లోపలకు వెళ్లారని చెప్పుకొచ్చారు.

ఆ రోజు మృతదేహం వద్దకు

ఆ రోజు మృతదేహం వద్దకు

వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తన పైన ఆగ్రహం వ్యక్తం చేసారని చెప్పారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని వెల్లడించారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలంటూ వారు చెప్పారని వివరించారు. దీంతో పాటుగా ఆ సమయంలో రక్తపుమడుగు శుభ్రం చేయాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని ఇనయతుల్లా చెప్పారు. తాను స్పందించకపోవటంతో తన పైన కేకలు వేసారని వివరించారు.

సీఐ శంకరయ్యతో చెప్పాను

సీఐ శంకరయ్యతో చెప్పాను

గంగిరెడ్డి ఎందుకు అంతగా కంగారు పడుతున్నాడని తాను వివేకా పీఏ కృష్ణారెడ్డిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. అయితే, ఆయన సైతం అదే తనకూ అర్దం కావటం లేదని సమాధానమిచ్చాడని ఇనయతుల్లా తన వాంగ్మూలంలో వివరించారు. ఆ తరువాత భాస్కర రెడ్డి.. మనోహర్ రెడ్డి లు వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఇంట్లోకి ఫ్రీజర్‌ బాక్సు తెప్పించారంటూ సీబీఐకి వివరించారు. ఘటన జరిగిన వెంటనే పులివెందుల సీఐ శంకరయ్య అక్కడకు వచ్చి బాత్ రూమ్ ను పరిశీలించారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అల్మారా హ్యాండిల్‌ విరిగి ఉండటాన్ని తాను చూసానని వివరించారు. అంతకుముందు అది విరిగి లేదనే విషయాన్ని శంకరయ్యకు చెప్పినట్లుగా పేర్కొన్నారు.

Recommended Video

YS Vivekananda Reddy కేసులో CBI దూకుడు, విచారణ మలుపులు | YSRCP | Oneindia Telugu
మెడ విరిగి ఉండటంతో..

మెడ విరిగి ఉండటంతో..

గోడల పైన రక్తపు మరకలను గమనించానంటూ తన వాంగ్మూలంలో వివరించారు. తనకు అనుమానం రాగానే.. వివేకాను ఎవరో చంపి ఉంటారనే అనుమానం ఉందని తాను సీఐ శంకరయ్యతో చెప్పగా... మీ సార్ ను చంపాలని ఎవరు అనుకుంటారు...ఆయన కమోడ్ పై పడిపోయుంటారని, దీంతో తలకు గాయాలై రక్తం వచ్చి ఉంటుందంటూ శంకరయ్యతో తనతో అభిప్రాయపడ్డారని వివరించారు. వివేకా మృతదేహాన్ని చూస్తున్న సమయంలో ఆయన మెడ వంగినట్లుగా కనిపించిందని చెప్పారు. సరి చేయాలని ప్రయత్నించే సమయంతో తన చేతి వేళ్లు వివేకా పుర్రెలోకి వెళ్లాయని..దీంతో పెద్దగా ఏడుస్తూ కేకలు వేసానని వివరించారు. తల వెనుక వైపునా తీవ్రంగా గాయాలు అయినట్లు చూసానని చెప్పారు. గంగిరెడ్డి నమ్మదగ్గ వ్యక్తి కాదని వివేకా చెప్పారని ఇనయతుల్లా తన వాంగ్మూలంలో వివరించినట్లుగా సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చింది.

English summary
YS Viveka typist Inayatullah statement to CBI in Viveka case, may key issues revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X