తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా అంటే.. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డే అని..ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దని సునీత, షర్మిల రోడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేకానంద రెడ్డి కూతురు సునీత తన తండ్రితో అవినాష్ రెడ్డితో ఉన్న విభేదాలపై ఓ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో అవినాష్ రెడ్డితో తన తండ్రికున్న గొడవల గురించి వివరించారామె.
సునీతకు కౌంటర్‌కు మీడియా ముందుకు వచ్చిన అవినాష్ రెడ్డి కొత్త అంశాలను లేవనెత్తారు. వివేకానంద రెడ్డి హంతకులతో ఎందుకు లాలూచి పడాల్సి వచ్చిందో చెప్పాలంటూ సునీతను వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తాజాగా వివేకానంద రెడ్డి రెండో భార్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
రెండో భార్య కొడుకుతో వివేకానంద రెడ్డి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. pic.twitter.com/WRLKl01YVl
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2024
ఆయన తన రెండో భార్య, పిల్లలతో సరాదాగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. గతంలో వివేకానంద రెడ్డి రెండో భార్య ఆమె పిల్లల ఫొటోలు బయటకు రాగా, ఇప్పుడు ఏకంగా వీడియోనే ప్రత్యక్షం కావడం సంచలనం రేపుతోంది. ఇటీవల తండ్రి రెండో పెళ్లి గురించి తనకు తెలియదని మీడియా ముఖంగా సునీత చెప్పారు.దీనికి కౌంటర్‌గానే ఈ వీడియోలు విడుదల చేసినట్టు అనుమానం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications