వివేకా కేసులో షర్మిల వాంగ్మూలం - సీబీఐ ముందు ఏం చెప్పారు..!!

వైఎస్ వివేకా కేసులో వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. హత్యకు సంబంధించి సీబీఐ ఎదుట షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదకలో స్పష్టం చేసింది. తన వద్ద ఆధారాలు లేవని..రాజకీయ కారణాలే హత్యకు కారణమని షర్మిల పేర్కొన్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ స్టేట్ మెంట్ ను సీబీఐ షర్మిల నుంచి గత ఏడాది అక్టోబర్ 7న సేకరించింది. షర్మిల స్టేట్ మెంట్ సంచలనంగా మారుతోంది.

షర్మిల స్టేట్ మెంట్ : వివేకా హత్య కేసు విచారణలో భాగంగా వైఎస్ షర్మిల నుంచి సీబీఐ స్టేట్ మెంట్ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 7న ఢిల్లీలో షర్మిల ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. తన వద్ద ఎటువంటి ఆధారాల్లేవని షర్మిల చెప్పారు. కానీ , రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని పేర్కొన్నారు. హత్యకు కుటంబ..ఆర్దిక వ్యవహారాలు కారణం కాదని చెప్పారు.

yssharmilaysvivekanandareddycbi1

అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావచ్చని షర్మిల అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చని షర్మిల అభిప్రాయపడ్డారు. హత్యకు కొన్ని నెలల ముందు వివేకా బెంగళూరులోని తన ఇంటికి వచ్చారని షర్మిల వివరించారు.

కడప ఎంపీగా పోటీ చేయమన్నారు : కడప ఎంపీగా పోటీ చేయాలని తనను కోరారని చెప్పుకొచ్చారు. ఎంపీగా అవినాష్ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లుగా చెప్పారని వెల్లడించారు. అవినాశ్ కు టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్ ను ఒప్పిద్దామని చెప్పారని పేర్కొన్నారు. జగన్ కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారని షర్మిల స్పష్టం చేసారు.

cbiyssharmila

ఖచ్చితంగా ఒప్పించగలననే ధీమాతోనే ఆయన మాట్లాడారని వివరించారు. జగన్ తనకు మద్దతు ఇవ్వరని తెలిసి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదన్నారు. బాబాయ్ పదేపదే ఒత్తిడి చయటంతో సరే అన్నానని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసారు. ఆ సమయంలో వివేకా ఎంపీగా షర్మిల వైపు ఎందుకు మొగ్గు చూపారని సీబీఐ ప్రశ్నించింది.

ఎమ్మెల్సీగా ఓడటం వెనుక : బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆయన ఆసక్తి చూపకపోయి ఉండచ్చని షర్మిల అభిప్రాయపడ్డారు. విజయమ్మపై వివేకా పోటీ చేశాక కొంత దూరం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చని వివేకా భావించారన్నారు. ఎమ్మెల్సీగా ఆయన ఓటమికి అవినాశ్ తో పాటుగా కొందరు స్నేహితులు కారణంగా పేర్కొన్నట్లు సమాచారం. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా..కొంత కోల్డ్ వార్ ఉందంటూ షర్మిల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ వివేకా కేసు ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+