వైజాగ్ క్రైమ్స్ : విశాలక్ష్మీనగర్ లో భారీ బంగారం చోరీ, దొరికిన బైక్ దొంగ

విశాఖపట్నం/విశాలక్ష్మీనగర్ : యజమానులు ఇంట్లోనే నిద్రిస్తున్న గుట్టు చప్పుడు కాకుండా.. తమ పని కానిచ్చేశారు. కిటకీ గుండా లోపలికి ప్రవేశించిన దొంగలకు.. బీవరువాకు తాళం వేసి లేకపోవడంతో పని మరింత సులువైంది. ఇంకేముంది.. ఎంచక్కా బీరువా మొత్తం సర్దేసి అక్కడి నుంచి ఉడాయించారు.

మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై.. బుధవారం క్లూస్ టీం కు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఘటన జరిగిన తీరును నిశితంగా పరిశీలించింది. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తును వేగవంతం చేసింది.

ఇక మరో ఘటనలో.. ట్రయల్ రన్ పేరుతో వాహన యజమానులను నమ్మించి, వాహనాలతో అక్కడినుంచి ఉడాయిస్తోన్న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు స్లైడ్స్ లో..

చోరీ జరిగిన భవనం

చోరీ జరిగిన భవనం


విశాలక్ష్మీనగర్ కాలనీలోని రెవెన్యూ పార్కు ఎదురుగా ఉన్ప భవనంలో నివాసముంటున్న ఎం.నాగముని నాయక్ ఇంట్లో ఈ చోరీ జరిగింది.

అర్థరాత్రి

అర్థరాత్రి


అర్థరాత్రి సమయంలో ఈ చోరీ ఘటన చేసుకోగా.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. రోడ్డు వైపు ఉన్న గోడ నుంచి దుండగులు భవనంలోకి ప్రవేశించారు.

తాళం వేయలేదు

తాళం వేయలేదు


బీరువాకు తాళం వేయకుండా వదిలేయడంతో.. 50 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు.

విశ్రాంత ఉద్యోగి

విశ్రాంత ఉద్యోగి


నాగముని నాయక్ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. విశ్రాంత ఉద్యోగిగా సేదతీరుతున్న ఆయనకు కిడ్నాప్ ఘటన షాక్ కు గురిచేసింది.

పోలీసు విచారణ

పోలీసు విచారణ


ఘటనపై ఫిర్యాదు అందడంతో క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు పోలీసులు. ఏడీసీపీలు వరదరాజులు, వేంకటేశ్వర్లు, ఏసీపీ ఫాల్గుణరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 వైజాగ్ క్రైమ్స్ : విశాలక్ష్మీనగర్ లో భారీ బంగారం చోరీ, దొరికిన బైక్ దొంగ

వైజాగ్ క్రైమ్స్ : విశాలక్ష్మీనగర్ లో భారీ బంగారం చోరీ, దొరికిన బైక్ దొంగ

కుటుంబ సభ్యుల నుంచి ఘటనా వివరాలు నమోదు చేసుకున్న అరిలోవ సీఐ తిరుపతిరావు, క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ కాంతారావు.. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

వైజాగ్ క్రైమ్స్ : విశాలక్ష్మీనగర్ లో భారీ బంగారం చోరీ, దొరికిన బైక్ దొంగ

వైజాగ్ క్రైమ్స్ : విశాలక్ష్మీనగర్ లో భారీ బంగారం చోరీ, దొరికిన బైక్ దొంగ

చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా చూస్తామని హామి ఇచ్చారు పోలీసులు.

బీటెక్ దొంగ

బీటెక్ దొంగ


కందుల శ్రీరామ్.. విజయ్ నగరం జిల్లా వుడాకాలనీకి చెందిన ఈ నిందితుడు.. చదివింది బీటెక్ చేసేది బైక్ దొంగతనాలు. ఓఎల్ఎక్స్ లో బైక్స్ ప్రకటనలకు చూసి, యజమానులకు ఫోన్ చేసి పలానా ప్రాంతానికి రావాల్సిందిగా చెబుతాడు. తీరా వచ్చాక.. ట్రయల్ రన్ పేరుతో వాహనంతో పరారవడం ఇతగాడి నేరాల చిట్టా.

బురిడీ కొట్టించి

బురిడీ కొట్టించి


ఎప్పుడూ ల్యాండ్ లైన్ ద్వారానే ఓఎల్ఎక్స్ ప్రకటనలకు ఫోన్ చేసేవాడు శ్రీరామ్.. దొంగతనాలే అలవాటుగా మార్చుకున్న అతడు.. బీచ్ రోడ్డులో ఓ బైక్, కిర్లంపూడిలో లే అవుట్ లో మరో బైకు, మరో నికాన్ డి కెమెరాను దొంగిలించాడు.

ఎట్టకేలకు చిక్కాడు

ఎట్టకేలకు చిక్కాడు


బుధవారం నాడు మద్దిపాలెం వద్ద వాహన తనిఖీలు చేస్తోన్న పోలీసులకు శ్రీరామ్ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సీఐ వెంకటరావు శ్రీరామ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మీడియా ముందు

మీడియా ముందు


శ్రీరామ్ ను అరెస్టు చేసిన అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. చోరీ చేసిన బైకులు, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో క్రైమ్ ఎస్ఐ దామోదరరావు, ఎస్ఐ క్రుష్ణారావు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+