హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్టులపై దాడికి విశాఖ మహిళాసంఘాల నిరసన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులపై అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా గురువారం ప్రగతిశీల మహిలా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శించారు. ముందుగా గాంధీ విగ్రహం వద్ద మహిళలంతా బైఠాయించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట ప్రధాన రహదారిపై మానవ హారం నిర్వహించారు. అక్కడి నుండి జర్నలిస్టులతో కలసి జీవీఎంసీ కార్యాలయం మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు.

ఈ సందర్బంగా పీఓడబ్య్లు అధ్యక్షురాలు ఎం. లక్ష్మీ మాట్లాడుతూ మీడియాపై కేసీఆర్ వ్యతిరేక ధోరణి తగదన్నారు. మహిలా జర్నలిస్టులపై దాడి చేయడం, దానికి పోలీసులు వంత పాడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్చకు వ్యతిరేకంగా మీడియాపైన, జర్నలిస్టులపైనా కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం అన్యాయమన్నారు. ఉపాధిని దెబ్బతీసేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు దిగుతుందని, రాజ్ భవన్ వద్ద జర్నలిస్టులపై నిరుంకుశ వైఖరి అవలంభించారని ఆరోపించారు.

రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కేసీఆర్ మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవడానికి ముందు జాగ్రత్తగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవి 9 ఛానల్స్ ను మూసివేసే ప్రయత్నం చేశారన్నారు. జర్నలిస్టులు, మీడియా వల్లే తెలంగాణ కల సాకారమైందని అన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా చేయడం శోచనీయమన్నారు. కేసీఆర్ బంధువులు, ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే మీడియాను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Vizag dharna against arrest of journalist in hyderabad

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నగర అధ్యక్షులు నాయకులు పి.నారాయణ్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు విజయరఘునాథరావు, పిఎన్ మూర్తి, సతీష్, యర్రా శ్రీనివాసరావు, ఆదినారాయణ, కళ్యాణ్ రామ్, మహిళా ప్రతినిధులు వరలక్ష్మీ, శిరీష, అనురాధలతో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్దోన్నారు.

English summary
Vizag dharna against arrest of journalist in hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X