తండ్రి, సోదరుడు రేప్ చేశారనే కేసులో కొత్త ట్విస్ట్: ఏమైంది...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తనపై తన తండ్రి, సోదరుడు పదే పదే అత్యాచారం జరిపారని 24 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది కొత్త మలుపు తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నారు.
యువతిపై వరుసగా లైంగిక క్రీడ సాగించిన దాఖలు ఏవీ లేవని వైద్య పరీక్షలో తేలినట్లు చెబుతున్నారు. తనపై వరుసగా తండ్రి, సోదరుడు అత్యాచారం చేశారని యువతి నెల రోజుల క్రితం విశాఖపట్నం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. యువతికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. వైద్య పరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

పొంతనలేని మాటలు...
తండ్రిపై, సోదరుడిపై ఫిర్యాదు చేసిన యువతిని పోలీసులు విచారించారు. అయితే ఆమె పొంతన లేకుండా మాట్లాడ సాగిందని, దాంతో వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించి, అందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

డబ్బు అడుగుతూ...
బాధితురాలు జల్సాలకు అలవాటు పడిందని, దాంతో తరుచుగా 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తూ వచ్చేదని, బాధితురాలు పొంతన లేని మాటలు మాట్లాడడంతో పాటు ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని బంధువులు కూడా చెప్పారని అంటున్నారు.

దర్యాప్తుపై ఒత్తిడి...
దర్యాప్తు విషయంలో ఒత్తిడి తేవడానికి బాధితురాలు వివిధ మహిళా సంఘాలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాము కేసును నిజాయితీగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. బాధితురాలికి మనస్థిమితం లేదని అనుమానిస్తున్నారు.

భర్తను వదిలేసి..
తండ్రి మాత్రమే కాకుండా సోదరుడు కూడా తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ కజిన్ కూడా అఘాయిత్యం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలు భర్తతో విడిపోయి నెల్లూరులోని తన పుట్టింట్లో ఉంటుంది. అది జరిగిన తర్వాత ఆమె తండ్రి రెండు వివాహాలు చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు.












Click it and Unblock the Notifications