వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి బీజేపీ తీరని ద్రోహం: నాడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు విశాఖ స్టీల్స్: మాస్ ఎంటర్‌టైన్‌మెంట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించి తీరుతామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తాజాగా లోక్‌సభలో చేసిన ప్రకటన.. రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ నేతల వైఖరెలాంటిదనేది మరోసారి స్పష్టం చేసినట్టయింది. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా..ఉన్న వాటిని ప్రైవేటీకరించే పనిలో పడింది మోడీ సర్కార్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ఆంధ్రా కోడలు నిర్మలా సీతారామన్ చేసిన తాజా ప్రకటన.. అటు రాష్ట్రంలో బీజేపీ నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

నిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతానిర్మలమ్మ ప్రకటన చిచ్చు: మండుతోన్న విశాఖ: వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనల సెగ: రాత్రంతా

విధానపరమైన నిర్ణయమే అయినా..

విధానపరమైన నిర్ణయమే అయినా..


నష్టాల్లో ఉన్న ప్రైవేటు రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ.. కోట్లాదిమంది తెలుగు ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా లాభాల్లోకి తీసుకుని రావాలనే విషయాన్ని పట్టించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. సుదీర్ఘకాలం పాటు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు చేస్తోన్న నిరసనలు, ఆందోళలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదనేది నిర్మల స్టేట్‌మెంట్‌తో తేలిపోయింది.

నాడు ప్రత్యేక హోదా..

నాడు ప్రత్యేక హోదా..

ఇదివరకు ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఇన్నేళ్ల తరువాత కూడా అమలుకు నోచుకోలేదు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రంలో అధికార మార్పడి చోటు చేసుకుని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. యూపీఏ సర్కార్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావట్లేదు.. అరకొరగా పోలవరం ప్రాజెక్టు తప్ప. విభజన చట్టాన్ని అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం నిర్ద్వందంగా నిరాకరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

విభజన చట్టం అమలులో..

విభజన చట్టం అమలులో..

విభజన నిర్ణయం తీసుకుంది యూపీఏ ప్రభుత్వమే అయినప్పటికీ.. పార్లమెంట్‌లో దాన్ని సమర్థించింది అప్పటి ప్రతిపక్ష ఎన్డీఏ కూటమే. యూపీఏ తరువాత గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలు చేయట్లేదు. విభజన అనేది సీమాంధ్ర ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. ప్రత్యేక హోదా హామీ, సీమాంధ్ర సమగ్రాభివృద్ధి కోసం విభజన చట్టాన్ని రూపొందించింది. అప్పట్లో దాన్ని ఆమోదించిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడానికి నిరాకరించడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమనే వాదనలు వినిపిస్తోన్నాయి.

ప్యాకేజీ పేరుతో అయిదేళ్ల టైమ్ పాస్

ప్యాకేజీ పేరుతో అయిదేళ్ల టైమ్ పాస్

హోదాకు బదులుగా.. ఎన్డీఏ-1 హయాంలో ప్రత్యేక ప్యాకేజీని తెరమీదికి తీసుకొచ్చింది కేంద్రం. ఆ పేరుతో అయిదేళ్ల పాటు టైమ్ పాస్ చేసింది. హోదాకు బదలుగా ప్యాకేజీ అంటూ ఊరిస్తూ అయిదేళ్ల కాలాన్ని గడిపేసింది. రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసుకున్న తరువాత.. దాని ఊసే ఎత్తట్లేదు. అదే సమయంలో ప్రైవేటీకరణకు పూనుకుంటోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కావడానికి కీలకంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ ప్రైవేటీకరించడానికి సమాయాత్తమైంది. అటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చక.. ఉన్న వాటిని కూడా ప్రైవేటీకరించడం వల్ల రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానికి ఎంత మాత్రం ప్రేమ ఉందనేది స్పష్టం చేసినట్టయింది.

బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారు?

బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారు?

నష్టాలొచ్చినందు.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నామంటూ కేంద్రం చెబుతోంది. బీజేపీ నేతల లెక్కల ప్రకారం చూసుకుంటే.. 2015 నుంచి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టింది. అంటే.. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే నష్టాలు ప్రారంభం అయ్యాయనేది స్పష్టమౌతోంది. అదే సమయంలో దేశీయ ప్రైవేటు ఉక్కు కంపెనీలు లాభాలబాట పట్టడం.. మోడీ సర్కార్ ద్వంద్వ నీతికి, కార్పొరేట్ల పట్ల అనుకూలంగా ఉంటారనడానికి నిదర్శనంగా చూపిస్తోన్నారు విశ్లేషకులు. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు దీన్ని ఎలా సమర్థించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

English summary
Andhra BJP leaders facing political heat after Finance Minister Nirmala Sitharaman latest statement on the Vizag Steel Privatisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X