రాయలసీమకు బిగ్ న్యూస్..! దేశంలో తొలి డ్రోన్, స్పేస్ సిటీలు..!
ఏపీలో రాయలసీమ ప్రాంతానికి ఇవాళ రెండు గుడ్ న్యూస్ లు అందాయి. వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రెండు కీలక ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు చేసింది. వైజాగ్ లో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు దీనికి వేదికైంది.రాయలసీమ ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి శంకుస్థాపన జరుపుకుంటున్న ఈరోజు చారిత్రాత్మకం అన్నారు. క్వాంటం వ్యాలీని జనవరిలో ప్రారంభిస్తున్నామని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని మేమెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉన్నామని వెల్లడించారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం చేస్తే మరింతలా తీర్చిదిద్దుతామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలు తీసుకువచ్చేంతలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

మరోవైపు డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రోన్లకు డిమాండ్ విస్తృతంగా ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనిని ఊహించి రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సిటీని తీసుకువచ్చిందన్నారు. ఐటీకి గుర్తింపు లేని సమయంలోనే ఐటీ భవిష్యత్‌ను ఊహించి అవకాశాలను సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారని గోయల్ ప్రశంసించారు. ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటం విషయంలోనూ చంద్రబాబు ముందంజలో ఉన్నారన్నారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను నెలకొల్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి కట్టుగా పనిచేస్తున్నారని గోయల్ తెలిపారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం కానుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం చేపడతారు. డ్రోన్ సిటీలో అధునాతన తయారీ పార్కులు, టెస్టింగ్ - సర్టిఫికేషన్ సెంటర్లు, 25,000 మంది రిమోట్ పైలట్‌లకు శిక్షణ ఇస్తారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000కి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు కూడా చేస్తారు. డ్రోన్ సిటీలో 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 100 శాతం ఎస్జీఎస్టీ రాయితీ వంటి ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం అందిస్తోంది.

అలాగే శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో దేశంలోనే తొలిసారి ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు కానున్నాయి. ట్విన్ స్పేస్ సిటీస్‌తో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపగ్రహ ప్రోటోటైప్ తయారీ, స్పేస్ టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్, ఉపగ్రహ విభాగాల తయారీ, లాంచ్ లాజిస్టిక్స్ సపోర్ట్‌కు ప్రాధాన్యం ఇస్తారు. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు, 35వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా స్పేస్ టెక్ ఫండ్ కింద రూ.100 కోట్ల కేటాయింపు చేశారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల నిర్మాణంతో భారత వైమానిక-అంతరిక్ష రంగాల్లో కొత్త శకం ఆరంభం కానుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు ఇవి కీలకం కానున్నాయి. ఈ మేరకు స్పేస్ సిటీకి సంబంధించి బ్లూ స్పేస్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు. డ్రోన్ సిటీలో పెట్టుబడులకు అల్గోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అకిన్ అనలిటిక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్సెల్మేజ్, ఏర్పేస్ ఇండస్ట్రీస్ సంస్థలు అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications