బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!

విజయనగరం జిల్లాలో ఈసారి జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాజీ మంత్రి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏకంగా నలుగురు కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించారు. ఇందులో బొత్స అన్న కుమారుడు చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురికాగా.. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు పోటీలో నిలిచారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో (Vizianagaram ZPTC Counting) వీరికి మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. అలాగే బొత్సతో విభేదించి పార్టీ మారిన మజ్జి శ్రీను కుమార్తె ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లలోనూ కూటమి ప్రభంజనం- తాజా అప్డేట్ ఇదే..!
ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లలోనూ కూటమి ప్రభంజనం- తాజా అప్డేట్ ఇదే..!

ఇవాళ జరుగుతున్న విజయనగరం జిల్లా జడ్పీటీసీ స్ధానాల ఓట్ల లెక్కింపులో బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష బొండపల్లి స్ధానంలో ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్ది పాశల నీరజ ఈ స్ధానంలో బొత్స అనూషను ఏకంగా 5136 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆమెకు షాక్ తప్పలేదు. మరోవైపు గరివిడి జడ్పీటీసీ స్ధానంలో బొత్స కోడలు పూజిత, గుర్ల జడ్పీటీసీ స్ధానంలో ఆయన సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు. అయితే గుర్లలో టీడీపీ అభ్యర్ధి నుంచి బొత్స సోదరి వెంకట లక్ష్మికి గట్టి పోటీ లభిస్తున్నట్లు సమాచారం. ఇక మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్ధానంలో ముందంజలో ఉన్నారు.

Vizianagaram ZPTC Counting Botcha Anusha Trails Two Family Members and Siri Sahasra Lead
స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!
స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!

మరోవైపు బొత్సతో విభేదించి టీడీపీలో చేరిన ఆయన మేనల్లుడు మజ్జి శ్రినుకు ఇతర చోట్ల మాత్రం షాకులు తప్పలేదు. చిన్నశీనును కాదని చీపురుపల్లి అసెంబ్లీ పరిధిలోని గరివిడి, గుర్ల ఓటర్లు బొత్సవైపు మొగ్గుచూపారు. గుర్ల జెడ్పీటీసీ వైసీపీ ఖాతాలో చేరగా.. గరివిడి, గుర్లలో అధిక సంఖ్యలో వైసీపీ ఎంపీటీసీలు గెలుస్తున్నారు. గరివిడి మండలంలో 20 ఎంపీటీసీలు ఉండగా.. 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 8 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఒకచోట ఇంకా ఫలితం తేలలేదు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 6 ఎంపీటీసీ ఫలితాలు అధికారికంగా వెల్లడించారు.ఇందులో నాలుగు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీన్ని బట్టి చీపురుపల్లి నియోజకవర్గంలో చిన్నశీను పాచికలు పారలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+