బొత్స వర్సెస్ మజ్జి, జెడ్పీ పీఠం ఆమెదే - అక్కడే లెక్క మారింది..తేల్చేసిన పోలింగ్..!?

బొత్సా వర్సస్ మజ్జి. ఇప్పుడు విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయంలో ఎవరిది పై చేయి. జెడ్పీ పీఠం దక్కేదెవరికి. ఇప్పుడు విజయనగరం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచుతున్న ఫలితం. విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసాయి. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి పైని భిన్న అంచనాలు వెల్లడి అవుతున్నాయి. అయినా.. రెండు వైపులా గుంభనం గా ఉన్నారు. రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో, తుది ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది.

విజయనగరం జెడ్పీ ఫలితం ఆసక్తిగా మారుతోంది. జిల్లాలో 76.18 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూటమి - వైసీపీ మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. అయితే, ఈ ఎన్నిక బొత్సా - మజ్జి మధ్య సమరంగా మారింది. వైసీపీ వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తెకు జడ్పీ సీటు పైన హమీ దక్కించుకున్నారు. అధికారికంగా కూటమి ప్రకటన చేయకపోయినా.. జిల్లా లో సీటు ఫలితం అనుకూలంగా వస్తే మజ్జిసిరికి కేటాయింపు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జెడ్పీ పీఠం పైన తన కుమార్తె అనూషను కూర్చోబెట్టాలని బొత్సా సత్యనారాయణ అన్ని ప్రయత్నాలు చేసారు. అందులో భాగంగా జెడ్పీటీసీ బరిలో తన కుటుంబం నుంచి ఎంపిక చేసిన వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. బొత్స కుమార్తె బొత్స అనూష బొండపల్లి నుంచి, కోడలు బొత్స పూజిత గరివిడి నుంచి, సోదరి వెంకటలక్ష్మి గుర్ల జెడ్పీటీసీ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
vizianagaram-zp-chairperson-post-botsa-and-majji-families-in-race-for-key-position

తుది ఫలితం పైన కొనసాగుతున్న ఉత్కంఠ

కాగా.. ఈ పోటీ వెనుక బొత్సా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా చీపురుపల్లి, గజపతినగరం ప్రాంతాల్లో కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం ద్వారా విస్తృత రాజకీయ ప్రభావాన్ని కొనసాగించిలా ప్రణాళికలు అమలు చేసారు. అదే సమయం లో చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర.. బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం, ఎస్.కోట నియోజక వర్గంలోని కొత్తవలసలో జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. బొత్సా వ్యూహాల పైన మజ్జి శ్రీనుకు.. అదే విధంగా మేనల్లుడు లెక్కల పైన బొత్సాకు పూర్తి స్పష్టత ఉంది. అయితే, అటు బొత్సా.. ఇటు మజ్జి పోటీ చేసిన మండలాల్లో భారీగా పోలింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు గా చెబుతున్న రెండు మండలాలు కీలకంగా మారుతున్నాయి. కూటమి తమదే గెలుపు అని ధీమా గా ఉంటే.. ఫలితం పైన బొత్సా ఫ్యామిలీ భరోసాగా కనిపిస్తోంది. దీంతో.. బొత్సా- మజ్జి కుటుంబాల నుంచి ఎవరికి జెడ్పీ పీఠం దక్కుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+