రాములోరి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం- తేదీలు ఖరార్

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 59,194 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,295 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. వీటి తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. టీటీడీ ఉన్నతాధికారులు పలుదఫాలుగా సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయక్కడ.

Vontimitta Sri Kodandarama Temple Hosts Grand Sri Ramanavami Brahmotsavams March 26 April 5

ఈ నెల 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట ఆలయంలో వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యంలో ఈ నెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాలను పురస్కరించుకుని ప్ర‌తి రోజు ఉద‌యం 7:30 నుండి 9:30 గంట‌ల వ‌ర‌కు, మళ్లీ సాయంత్రం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

27న.. ఉదయం 9:30 నుండి 10:15 నిమిషాల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నంలో ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు. 11 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు శ్రీరామనవమి ఆస్థానం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలను చేపడతారు. రాత్రి- కోదండరాములవారు శేష వాహనంపై ఊరేగుతారు.

28న.. ఉదయం- వేణుగానాలంకారంలో స్వామివారు భక్తులను కరుణిస్తారు. రాత్రి హంస వాహనంపై ఊరేగుతారు. 29న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి- సింహ వాహన సేవ ఉంటుంది. 30న.. ఉదయం నవనీత కృష్ణాలంకారంలో కోదండరాముడు దర్శనం ఇస్తారు. రాత్రి- హనుమంత వాహనంపై పురవీధుల్లో కటాక్షిస్తారు. 31న.. ఉదయం- మోహినీ అలంకారం, రాత్రి అత్యంత ప్రాచుర్యం పొందిన గరుడసేవను నిర్వహిస్తారు.

ఏప్రిల్ 1న.. ఉదయం- శివధనుర్భాణ అలంకరణ ఉంటుంది. అదే రోజు మద్యాహ్నం 3:15 నిమిషాలకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 6:30 నుండి 8: 30 వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. రాత్రి- గజవాహన సేవ ఉంటుంది. 2న.. ఉదయం రథోత్సవం, 3న.. ఉదయం కాళీయమర్ధనాలంకారం, రాత్రి- అశ్వవాహనం ఉంటుంది. 4న.. ఉదయం చక్రస్నానం, రాత్రి- ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+