ఓటర్లూ మేలుకోండి.. ఐదేళ్ళకోసారే అవకాశం; సముచిత నిర్ణయం తీసుకోండి!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోసం ప్రచార పర్వం కొనసాగి, ఎట్టకేలకు నిన్న సాయంత్రం ముగిసింది. నిన్నటి వరకు ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నం చేయడం రాజకీయ పార్టీల వంతు అయితే, ఇప్పుడు మంచి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడం ఓటర్ల వంతుగా మారింది. ఈ సమయంలో ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి
ఎవరు ఏది చెబితే అది నమ్మకుండా, పోటీ చేసిన వారిలో మంచి నాయకుడు ఎవరు? ఎవరికి ఓటేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది? నిస్వార్ధంగా ఏ ప్రజా ప్రతినిధి తమకు సేవ చేయగలుగుతాడు? వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు చైతన్యంతో వ్యవహరించాలి. నిన్నటి వరకు సాగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు హామీలను గుప్పించారు.

ఉచిత పథకాల తాయిలాలను ఓటర్ల ముందు పెట్టిన రాజకీయ పార్టీలు
ప్రతి పార్టీ మేనిఫెస్టో లోని రూపొందించి మేనిఫెస్టోలో ద్వారా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. ఇది చేస్తాం అది చేస్తాం అంటూ ఊదరగొట్టారు. మేము గెలిస్తే ఈ పథకం తెస్తాం, ఆ పథకం ఇస్తామంటూ ఉచిత పథకాల తాయిలాలను ఓటర్ల ముందు పెట్టారు. మా మేనిఫెస్టో చూసి ఓటెయ్యండి అని ఓటర్లకు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఓటర్లు గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.
తమ సొంత డబ్బులతో పథకాలు ఇవ్వటం లేదు
ఓటర్లకు తాము గెలిస్తే ఈ పథకాలు ఇస్తామని చెబుతున్న నాయకులు ఎవరూ తమ సొంత డబ్బులతో పథకాలను అందించడం లేదు. ప్రజల డబ్బునే మళ్లీ పథకాల రూపంలో అందిస్తున్నారు. మన డబ్బునే మళ్లీ మనకు ఉచితంగా ఇస్తున్న, ఇస్తామని చెబుతున్న రాజకీయనాయకుల విషయంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. తమ సంక్షేమం కోసం ఉచితంగా పథకాలు ఇచ్చారు. బ్యాంకులలో డబ్బులు జమ చేశారు.. కాబట్టి వారికి ఓటేద్దాం అన్న ధోరణి మంచిదికాదు.

ఉచితాలతో రాష్ట్రం బలహీనం
ఎవరికి ఓటేసి పట్టం కడితే తమ ప్రాంతాన్ని, అలాగే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారు అన్నది ప్రతి ఒక్క ఓటరు అర్థం చేసుకుని, తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఉచిత పథకాలను ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదు. ఉచిత పథకాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా బలహీనమవుతుంది .
మంచి నాయకుడికి ఓటేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్
ఈ విషయాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి నాయకుడికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో, దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మంచి నాయకుడికి ఓటేస్తేనే రాష్ట్రానికి, మీకు భవిష్యత్ ఉంటుందని చెప్పారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications