హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓట్ల పండుగ‌: తెలంగాణ నుండి ఏపికి ప‌ది ల‌క్ష‌ల మంది : మూడు వేల బ‌స్సులు : ప‌్ర‌తీ ఓటు కోసం పాట్లు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు...హైద‌రాబాద్‌లో మ‌రో సంక్రాంతి ని త‌ల‌పిస్తోంది. భాగ్య‌న‌గ‌రంలో ఉద్యోగాల కోసం ఏపి లోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారంతా ఇప్పుడు త‌మ ఓటు వేసేందుకు ఏపికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మ‌త నియోజ‌క‌వ గ‌ర్గాల్లో ఓట్లు ఉండి హైద‌రాబాద్‌లో ఉన్న వారిని ర‌ప్పించే బాధ్య‌త అభ్య‌ర్దులే తీసుకుంటున్నారు.

<strong>నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్ </strong>నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్

ప‌ది ల‌క్ష‌ల ఓట‌ర్లు రాక‌..
ఏపిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటు హ‌క్కు ఉన్న దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది ఓట్ల పండుగ‌కు ఏపికి త‌ర‌లి వ‌స్తున్నారు . ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీల నేత‌లు ఏ జిల్లా వాసులు ఏ ప్రాంతంలో ఉంటే అక్క‌డ‌కి వెళ్లి ప్ర‌చారం..ఆత్మీయ స‌ద‌స్సులు సైతం నిర్వ‌హించారు. పోలింగ్ నాడు ఖ‌చ్చితంగా వచ్చి ఓటు వేయాల‌ని అభ్యర్దించారు. దీంతో..ఏపి కి చెందిన 10 ల‌క్ష‌ల మంది హైద‌రాబాద్ ను వీడి ఏపి లోని సొంత నియోజ‌క‌జ‌వ‌ర్గాల‌కు త‌ర‌లి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొ ని ప్ర‌త్యేక బ‌స్సులు..రైళ్లకు అద‌న‌పు బోగీలు ఏర్పాటు చేసారు. అద‌నంగా వెయ్యి వ‌ర‌కు ప్ర‌యివేటు బ‌స్సుల‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. రెగ్యుల‌ర్ గా తిరిగే బస్సుల‌కు ఇది అద‌నం. దీంతో..ఓట‌ర్లు అంతా 11వ తేదీ ఉద‌యం ఏపిలోని జిల్లాల‌కు చేరేలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు. ఇక వీరి ఓట్లు సైతం ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కీల‌కం కానున్నా యి. దీంతో, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా పార్టీలు జాగ్ర‌త్త ప‌డుతున్నాయి.

Votes festival in AP : 10 lakh voters form Hyderabad to ap on 11th

అభ్య‌ర్దుల‌దే బాధ్య‌త‌..
హైద‌రాబాద్ నుండి ఓట‌ర్లు ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల‌కు వారు చేరేలా ఎన్నిక‌ల బరిలో ఉన్న అభ్యర్దులే చూస్తున్నారు. వారి త‌ర‌పున ప్ర‌తినిధులు ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన వారి కోట్ల కోసం అన్ని రకాలుగా ప్ర‌యత్నాలు చేస్తున్నారు. ఏపి తో పాటుగా పాటుగా తెలంగాణ‌లోనూ ఒకే సారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని వైసిపి నేత‌లు ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిని క‌లిసారు. తెలంగాణ లోక్‌స‌భ పోరు..ఏప అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఒకే రోజు పోలింగ్ జ‌రుగుతోంది. హైజూబ్ల‌ద‌రాబాద్‌లో ప్ర‌ధానంగా కుక‌ట్ ప‌ల్లి, కుత్బుల్లాపూర్ , రాజేంద్ర న‌గ‌ర్‌, ఎల్‌బి న‌గ‌ర్‌, శేరిలింగం ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ‌గా ఏపి ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. దీంతో..అక్క‌డ నుండి ఏపి ఓట‌ర్ల‌ను త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు త‌రిలించటం పై దృష్టి పెట్టారు.

English summary
Votes festival in AP. Settlers in Hyderabad form AP districts are planning to coming for vote. APSRTC and TSRTC arranging special buses for these voters journey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X