విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

|
Google Oneindia TeluguNews

సమాజంలోని వ్యవస్థలపై, రాజకీయ నేతల తీరుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుపేదలకు న్యాయ సహాయం అందడంలేదంటూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తాజాగా.. న్యాయం కోసం పోరాడాల్సిన సమయంలో మౌనం వహించడం పిరికితనమే అవుతుందంటూ యువ లాయర్లకు హితబోధ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కంటే దశాబ్ధాల ముందు సుప్రీం జడ్జిలపై సంచలన ఫిర్యాదులు చేసిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరును ప్రస్తావిస్తూ, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. తదుపరి సీజేఐగా పేరు సిఫార్సు అయిన తర్వాత జస్టిస్ రమణ తొలిసారి సొంత గడ్డ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు.

సీబీఐతో జగన్ రహస్య కాన్ఫరెన్స్ -రియాక్షన్ తప్పదు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం -బీజేపీకి సవాల్సీబీఐతో జగన్ రహస్య కాన్ఫరెన్స్ -రియాక్షన్ తప్పదు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం -బీజేపీకి సవాల్

విశాఖకు సందేశం.. శ్రీశైల దర్శనం

విశాఖకు సందేశం.. శ్రీశైల దర్శనం

సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యాక్తిగా రికార్డులకు ఎక్కనున్న జస్టిస్ ఎన్వీ రమణ సొంత రాష్ట్రం ఏపీలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నంలోని 'దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం' స్నాతకోత్సవం ఆదివారం జరగ్గా, వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగంచేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు, దామోదరం సంజీవయ్య స్ఫూర్తి అంశాలపై లోతైన వివరణలు ఇచ్చారు. అలాగే, కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీశైలం ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆ సమయంలో మౌనం పిరికితనమే

ఆ సమయంలో మౌనం పిరికితనమే


న్యాయంకోసం పోరాడాల్సిన సమయంలో మౌనం పాటించడం పిరికితనమే అవుతుందన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలను న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారు ఆదర్శంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనను ఉపేక్షించవద్దని, న్యాయపరంగా బలంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. స్వరం లేని వారి తరఫున గొంతెత్తాల్సిన బాధ్యత యువతపై ఉందని, వారికి సాధికారికత కల్పించాలని సూచించారు. లా కాలేజీలు, కొత్త లాయర్ల సంఖ్య పెరుగుతున్నా, దేశంలో ఇంకా కొన్ని లక్షల మందికి న్యాయ సహాయం అందడంలేదని, ఆచరణకు, సిద్ధాంతాలకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటోందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

viral video:చిరుతతో నోముల భగత్ సరదా వాక్ -సాగర్ పోరులో టీఆర్ఎస్‌కే ఓటన్న ఆర్జీవీ -3నామినేషన్లు వెనక్కిviral video:చిరుతతో నోముల భగత్ సరదా వాక్ -సాగర్ పోరులో టీఆర్ఎస్‌కే ఓటన్న ఆర్జీవీ -3నామినేషన్లు వెనక్కి

అగాధాన్ని పూరించే పనిలో..

అగాధాన్ని పూరించే పనిలో..

పాత తరంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారు చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చేదని, సౌకర్యాలు, వనరుల పరంగా ప్రస్తుత తరం విద్యార్థులు అదృష్టవంతులని, విద్యార్థులు తమకున్న జ్ఞానం, ఉత్సాహంతో కొత్త ఆలోచనలను సృజించడం ద్వారా ప్రస్తుత వ్యవస్థల్ని, విధానాల్ని, మొత్తం సమాజాన్ని మెరుగుపరచగలరని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. లోతైన ఆలోచన, విమర్శనాత్మకమైన విశ్లేషణ వంటివి విద్యా వ్యవస్థ విధి అయినప్పటికీ ప్రస్తుత విద్యావ్యవస్థకు మన విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను తీర్చిదిద్దే సామర్థ్యం అంతగా లేదని, విద్యార్థులు పోటీ వలయంలో చిక్కుకుపోయారని సుప్రీం జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఆచరణకు, సిద్ధాంతానికీ మధ్య న్యాయవిద్య అగాథాన్ని పూరించే ప్రయత్నం చేస్తోందని ఆయన తెలిపారు.

3.8 కోట్ల కేసులు పెండింగ్‌

3.8 కోట్ల కేసులు పెండింగ్‌

దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో పెండింగ్ కేసులు, న్యాయ సహాయంలో కొరత అంశాలను కూడా జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు. న్యాయ పట్టభద్రులు లోక్‌ అదాలత్‌లు, న్యాయసహాయ కేంద్రాలు, లీగల్‌ ఎయిడ్‌ కేంద్రాలు, మధ్యవర్తిత్వ కేంద్రాలతో కలిసి పనిచేస్తే ప్రాక్టికల్‌ పరిజ్ఞానం లభిస్తుందని ఆయన చెప్పారు. దేశంలో 1500 న్యాయ విద్యాసంస్థలు ఉన్నాయని, వీటితో పాటు 23 జాతీయ న్యాయ యూనివర్సిటీల నుంచి ఏటా దాదాపు 1.5 లక్షల విద్యార్థులు పట్టభద్రులవుతున్నారని, ఏటా ఇంతమంది న్యాయవాదులు ఉన్నప్పటికీ దేశంలో 3.8 కోట్ల మేరకు పెండింగ్‌ కేసులు ఉన్నాయని, తద్వారా వాసి కంటే రాసి ఎక్కువ అవుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోందన్నారు. మన దేశంలో ప్రమాణాలు లేని విద్యా సంస్థలే ఎక్కువగా ఉన్నాయని, న్యాయవ్యవస్థ దీన్ని దృష్టిలో ఉంచుకుని సవరించే ప్రయత్నం చేస్తోందని జస్టిస్ రమణ తెలిపారు. కాగా,

దామోదరం సంజీవయ్య స్ఫూర్తి..

దామోదరం సంజీవయ్య స్ఫూర్తి..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని జస్టిస్‌ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సంజీవయ్య జీవితం, విలువలు, సేవల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలనను అందించిన సంజీవయ్య లాంటి నేతలు నేటి సమాజంలో లేకపోవడం దురదృష్టకరమని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సంజీవయ్యకు సంబంధించి ఆసక్తికర విషయాలను ఇలా చెప్పుకొచ్చారు..

తల్లిని చూసి సీఎం పదవి..

తల్లిని చూసి సీఎం పదవి..

''సంజీవయ్య గొప్పతనం ఏంటంటే.. ఆయనను ముఖ్యమంత్రిని చేసే అంశాన్ని జవహర్‌ లాల్‌ నెహ్రూ పరిశీలిస్తున్నారని తెలిసినప్పుడు చాలా మంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేకయారు. సంజీవయ్య అవినీతిపరుడని, కోట్ల రూపాయలు ఆర్జించారని ఫిర్యాదు చేశారు. దీంతో విషయం తెలుసుకునేందుకు నెహ్రూ తన సన్నిహితుడిని సంజీవయ్య గ్రామానికి పంపారు. నెహ్రూ సన్నిహితుడు సంజీవయ్య ఊరు చేరుకుని పొలిమేరలోని ఒక పూరిగుడిసె ముందు నిలిపారు. అక్కడ ఓ వృద్ధురాలు మట్టి పొయ్యిలో వంట చేస్తుండడం గమనించారు. ఆమె సంజీవయ్య తల్లి అని తెలుసుకుని ఢిల్లీ నేత ఆశ్చర్యపోయారు..

ఆయనకు మిగిలిన ఆస్తులవే..

ఆయనకు మిగిలిన ఆస్తులవే..

తన కుమారుడు ముఖ్యమంత్రి అయితే తనకు బొగ్గుల పొయ్యి కొనిస్తాడనుకుంటున్నానని సంజీవయ్య తల్లి అనడంతో నెహ్రూ సన్నిహితుడి నోటమాట రాలేదు. సంజీవయ్య వ్యక్తిత్వం గురించి మరే విచారణ అవసరం లేదంటూ వెనక్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత వారానికి దామోదరం ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా కూడా ఆయన రిక్షాలోనే అసెంబ్లీకి వెళ్లారు. పారదర్శకమైన, అవినీతి లేని పాలన అందించారు. దామోదరం మరణించినప్పుడు ఆయన ఆస్తులు మూడే మిగిలాయి. అవి ఆయన దుస్తులు, ఒక ప్లేటు, ఒక గ్లాసు. ఇలాంటి నేతలు నేడు ఉన్నారా?'' అని జస్టిస్‌ రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శ్రీశైలంలో కాబోయే సీజేఐ పూజలు

శ్రీశైలంలో కాబోయే సీజేఐ పూజలు

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీవో, ఆలయ ఈవో తదితరులు జస్టిస్‌ రమణకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు జస్టిస్‌ రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం.. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

English summary
Supreme Court judge Justice N.V. Ramana, the seniormost apex court judge who has been recommended for appointment as the 48th Chief Justice of India, said the most vulnerable sections of society often fall prey to human rights atrocities from either the state or anti-social elements. justice ramana urged young lawyers to educate the poor and the vulnerable about their rights. Justice Ramana virtual address at the Damodara Sanjivayya National Law University convocation. Justice NV Ramana on Sunday visited the famous Shaiva shrine Srisailam Bhramaramba Mallikarjuna Swamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X