ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ బిగ్ ట్విస్ట్..!!

ఏపీకి మరో కీలక ప్రాజెక్టు దక్కుతోంది. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తరువాత ఏపీ పునర్విభజన చట్టం మేరకు విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. విశాఖ కేంద్రంగా ఈ జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభం అవుతుంది. దీంతో, ఏపీలోని పలు డివిజన్ రైల్వే కార్యాలయాలు ఈ జోన్ పరిధిలో పని చేయను న్నాయి. అయితే, కీలకమైన వాల్తేరు డివిజన్ విషయంలో మాత్రం రైల్వే శాఖ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

ప్రధాని శంకుస్థాపన
రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న ఏపీకి రైల్వే జోన్ పట్టాలెక్కుతోంది. జోన్ ప్రధాన కార్యాలయంకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితమివ్వనున్నారు. విశాఖ పట్నంలో రూ.149 కోట్ల విలువైన కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకు స్థాపన చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇదే సమయంలో అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 3 రైల్వే లైన్లు, 6 రైల్వే ప్రాజెక్టులు, 10 రోడ్డు నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో క్రిస్‌సిటీ అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

Waltair railway division will be retained even after the new South Coast Railway zone as reports

కొత్త జోన్ లో విలీనం
ఇక, విశాఖ రైల్వే జోన్ లో ఏపీలో ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు , విజయవాడ డివిజన్లు కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే లో చేరనున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వాల్తేరు డివిజన్ ను విశాఖ జోన్ లో విలీనం చేయాలనే డిమాండ్ ఉంది. దీని పైన స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం రైల్వే శాఖ పైన ఒత్తిడి పెంచాయి. కానీ, ఇప్పుడు ప్రధాని కొత్త జోన్ కు శంకుస్థాపన చేస్తున్న వేళ రైల్వే అధికారులు వాల్తేరు డివిజన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

వాల్తేరు డివిజన్ పై
తాజా ప్రతిపాదనల మేరకు వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగం కొత్త జోన్‌లో అంటే సౌత్ కోస్ట్ రైల్వే లో చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే పొరుగున ఉన్న విజయవాడ డివిజన్‌లో ఈ మేరకు నిర్దేశించిన ప్రాంతం విలీనం అవుతుంది. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగం ఒరిస్సా రాయగఢ్‌ లోని ప్రధాన కార్యాలయం ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద కొత్త డివిజన్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. ఇక, జోన్ శాశ్వత కార్యాలయం పూర్తయ్యే వరకూ తాత్కాలిక కార్యాలయంలో విధులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందు కోసం జోన్ కు కొత్త జనరల్ మేనేజర్ నియామ కం.. డివిజన్ల విలీనం పైన అధికారిక ప్రక్రియ మొదలైంది. ఈ రోజు లేదా రేపు ఈ మేరకు అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+