కొత్త చిక్కు: పవన్ కళ్యాణ్‌కు సీమ వార్నింగ్, రెచ్చిపోయిన అభిమాని!

అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త చిక్కులు వచ్చాయి! పవన్‌ను అనంతలో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు.

అనంతపురం: అనంతపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త చిక్కులు వచ్చాయి! పవన్‌ను అనంతలో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో పలువురు ప్రముఖులు తాము పోటీ చేసేందుకు రాయలసీమను ఎంచుకున్నారు. మరోవైపు, సీమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఆ ప్రాంతవాసులు ప్రభుత్వాలపై పోరాడుతున్నారు.

పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక

పవన్ కళ్యాణ్‌కు హెచ్చరిక

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచం వెంకటసుబ్బా రెడ్డి.. జనసేన అధినేతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తిరగనీయమని వార్నింగ్

తిరగనీయమని వార్నింగ్

తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు ప్రభుత్వాలు రాయలసీమకు చేస్తున్న తీవ్రమైన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని, రాయలసీమలో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్‌ను సీమలో తిరగనీయమని హెచ్చరించారు.

జనసేన కౌంటర్

జనసేన కౌంటర్

కుంచం వెంకట సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే కళ్యాణ్ దిలీప్ అనే వ్యక్తి కౌంటర్ ఇచ్చారు.

ఘాటు వార్నింగ్

ఘాటు వార్నింగ్

పవన్ కళ్యాణ్‌ను సీమలో తిరగనీయపోవడానికి మీరెవరని ప్రశ్నించారు. కుంచంకు ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఆయన అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా చెబుతున్నారు.

జనసేన తీరుపై ఆగ్రహం

జనసేన తీరుపై ఆగ్రహం

హెచ్చరిక వరకు ఓకే కానీ, అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన పార్టీ తీరుపై పలువురు మండిపడుతున్నారని తెలుస్తోంది. రాయలసీమలో తిరగనీయమని వార్నింగ్ ఇచ్చినందుకే జనసేన వార్నింగ్ ఇస్తే.. ఏళ్ల తరబడి ఎంతోమంది నేతలు ఇక్కడి నంచి పోటీ చేసి, ఓట్లు వేయించుకొని న్యాయం చేయనందుకు మేం వారిని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+