పెమ్మసాని పేరుతో అమరావతిలో ఇసుక టిప్పర్లు.. కేంద్ర మంత్రి క్లారిటీ
సాఫ్ట్ గా ఉండే సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. తన పేరును ఒక బ్రాండ్ గా గుంటూరు ప్రాంతంలో క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు ఆ పేరుకు భంగం వాటిల్లుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. అంతే ఒక్కసారిగా అభిమానులకు, కార్యకర్తలకు సైతం వార్నింగ్ ఇచ్చారు. సహజంగా రాజకీయాల్లో ఉన్న నేతల పేర్లను అభిమానులు వారివారి వాహనాలపై రాయించుకుంటారు. అయితే కొందురు ఆ పేరును తప్పుడు పనులకు కూడా వాడటం పెమ్మసానికి కోపం తెప్పించింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఆయన ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. అసలేం జరిగిందంటే..
2019 లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని అందుకున్నారు డా. పెమ్మసాని చంద్రశేఖర్. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా కూడా పని చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో కీలక భూమికను సైతం పోషిస్తున్నారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటిలో పెమ్మసాని కూడా సభ్యులు. అయితే గత కొద్ది రోజులుగా పెమ్మసానిపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి. అమరావతి రైతుల నుంచి పెమ్మసానికి భంగపాటు కలిగిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు పెమ్మసాని.
అయితే రాజధానిలో ఇసుక టిప్పర్లు ఎక్కవగా తిరుగుతుంటాయి. గతంలో ఈ ప్రాంతంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సైతం ఇసుక లారీలు తిప్పారనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు పెమ్మసాని పేరుతో టిప్పర్లు రాజధాని ప్రాంతంలో తిరుగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి ఇసుక వ్యాపారం చేస్తున్నారా?.. సొంతంగా లారీలు పెట్టి ఇసుక సరఫరా చేస్తున్నారా? అనే అనుమానాలు రాజధాని ప్రాంతంలో వ్యాపించాయి. టిప్పర్ వాహనాలపై పెమ్మసాని అంటూ తాటికాయంత అక్షరాలు పసుపు రంగులో ముద్రించి లారీలు తిప్పుతున్నారు కొందరు.. దీంతో ఆ టిప్పర్ లారీ ఫొటోలు పెట్టి పలువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వార్త చివరికి పెమ్మసానికి చేరడంతో నేరుగా ఆయనే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. తనకు రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. భారత్‌లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ కంపెనీలను నడపలేదన్నారు. ప్రొత్సహించలేదన్నారు. అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్చిచెప్పేశారు. ఎక్కడైనా ఆ తరహా ప్రచారం జరుగుతున్నా ప్రకటనలు, ఫోటోలు కనిపించినా పూర్తిగా అవాస్తమని తెలిపారు.
"ఎక్కడైనా ప్రచారం అవుతున్న ఏ ప్రకటనలు, చిత్రాలు, ప్రచార సమాచారం లేదా ఆరోపణలు పూర్తిగా అబద్ధమైనవి మరియు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ఇవి ఆయన గౌరవం మరియు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసిన చర్యలుగా పరిగణించబడతాయి. నేను ఏ అక్రమ లేదా అనైతిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు, సహించరు కూడా. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నా. నా పేరు లేదా ప్రతిష్ఠను అనధికారికంగా వినియోగించిన వారిపై, ముందస్తు సమాచారం లేకుండానే, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి తప్పుడు లేదా మోసపూరిత సమాచారాన్ని ఎవరైనా గమనిస్తే, తక్షణమే మా కార్యాలయానికి తెలియజేయగలరు". అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications