Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతా రివర్స్!: సుజన కొత్తబాణి, బిజెపిపై బాబు గేరు మార్చారా?

న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రమంత్రులు దాదాపు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువ సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం తనను కలిసిన టిడిపి ఎంపీలతో చెప్పారు.

నిన్నటి వరకు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పిన టిడిపి నేతలు ఇప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారు. ప్ర్తత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చుతామని కేంద్రం చెబుతోందని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మంగళవారం చెప్పారు.

ప్రత్యేక హోదా పైన నటుడు శివాజీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, విపక్షాలు టిడిపిని ప్రశ్నించాయి. పలు రాజకీయ పార్టీలు మంగళవారం నాడు బందుకు పిలుపునిచ్చాయి. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ సోమవారం ఢిల్లీలో దీక్ష చేశారు. మునికోటి ఆత్మబలిదానం చేసుకున్నారు.

Was Chandrababu warned BJP about Special Status?

విపక్షాల మాటలకు టిడిపి నేతలు మాత్రం తాము తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని నిన్నటి వరకు చెప్పారు. ఏపీ బిజెపి నేతలు కూడా ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. హోదా సాధిస్తామని కొందరు, హోదా కాకపోయినా అంతకుమించి సాధిస్తామని మరికొందరు చెప్పారు.

టిడిపి మాత్రం కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తామని నిన్నటి వరకు చెప్పారు. మంగళవారం మాత్రం బాణీ మార్చింది. వైసిపిలా మాదిరి పార్లమెంట్‌లో ఆందోళనకు దిగవలసిన అవసరం తమకు లేదనీ, ప్రత్యేక హోదాను సాధించటానికి కావలసిన విధి విధానాలు తమ పార్టీకి ఉన్నాయని సుజన గతంలో చెప్పారు.

అదే సుజన మంగళవారం కొత్త పల్లవి వినిపించారు. ప్రత్యేక కేటగిరి హోదా సంపాదించకపోయినా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు సాధించే తీరులో ఒక సరికొత్త ప్యాకేజీని పొందే దిశలో కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.

టిడిపి ఏంపీ జెసి దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక కేటగిరి హోదా విషయంలో తన సహజ ధోరణిలో వ్యంగ్య బాణాలు విసిరారు.

ప్రత్యేక కేటగిరి హోదా అంటే ఏమిటి? ఈ విషయంలో చాలామందికి పూర్తి అవగాహన లేదని, మేము కలిసిన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులకు రాష్ట్ర సమస్యలపై మాకంటే ఏక్కువ అవగాహన ఉందని, మేము అడగకముందే వారే మాతో అన్ని సమస్యలపై మాట్లాడార'ని చెప్పారు.

అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రులతో ఘాటుగా మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీ, బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా తదితరులతో చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఏదో ఒకటి తేల్చాలని, లేదంటే ఇరు పార్టీలకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వారితో చెప్పారని అంటున్నారు. ఇలా అయితే కష్టమని, మీ ఇష్టమని, చేయలేకుంటే చెప్పాలని మా దారి మేం చూసుకుంటామని ఘాటుగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.

నిన్నటి వరకు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన టిడిపి నేతలు, ఆ పార్టీ కేంద్రమంత్రులు ఇప్పుడు కొత్తబాణి వినిపించారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని, సహనంతో ఉండి అన్ని సాధించుకుంటామని చెప్పిన చంద్రబాబు మండిపడ్డారని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+