TTD: తిరుమలలో శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, కొత్త రూల్స్, అలా చేస్తే అంతే
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ మోస్తారుగా ఉంది. వానలు కూడా లెక్క చెయ్యకుండా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. గతం కంటే చాలా త్వరగా స్వామి వారి దర్శనం అవుతోందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలో రుచికరమైన అన్నప్రసాదం అందుతోందని భక్తులు సంతోషంగ వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటిలాగే శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. మంగళవారం శ్రీవారిని 73,332 మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం 25,202 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంళవారం భక్తులు శ్రీవారి హుండీలో రూ. 3.73 కోట్లు కానుకలు వేసి వారి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్వనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో దుకాణదారులతో టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి గౌతమి మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు వెనక్కి తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. అలాంటి దుకాణదారుల మీద చర్యలు తీసుకుంటామని జేఈఓ శ్రీమతి గౌతమి హెచ్చరించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు తిరుమలలోని దుకాణదారులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు జేఈఓ శ్రీమతి గౌతమి చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలని, కాళీ గాజు బాటిల్ వెనక్కు తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని జేఈఓ శ్రీమతి గౌతమి దుకాణదారులకు చెప్పారు. అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈఓ శ్రీమతి గౌతమి ఆదేశించారు.
టీటీడీ నియమాలకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు. ఇంతకాలం శ్రీవారికి భక్తులకు అధిక దరకు వాటర్ బాటిల్స్ విక్రయిస్తు దుకాణదారులకు చెక్ పడింది.












Click it and Unblock the Notifications