శాంతించిన సాగరం: కదిలిన విశాఖ జనం(పిక్చర్స్)

విశాఖపట్నం: హుధుద్ పెను తుఫాను బాధిత ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. విద్యుత్, నీటి సరఫరా మినహా మిగిలిన విషయాల్లో కొంత కుదుట పడుతోంది. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నుంచి నగరంలోనే మకాం వేసి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించడంతో అధికారులు సైతం ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. దీంతో వ్యాపారులు, బ్లాక్ మార్కెటీర్ల ఆటలకు అడ్డుకట్ట పడిందనే చెప్పాలి.

తుఫాను అనంతరం ప్రభావిత ప్రాంతాల్లో పెచ్చుమీరిన వ్యాపార ధోరణి ఇప్పుడే తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు ఊరటనిస్తున్నాయి. పెనుగాలుల బీభత్సం సృష్టించిన తర్వాత సోమవారం నాటి పరిస్థితితో పోలిస్తే బుధవారం నాటికి పాలు, కూరగాయలు, తదితర నిత్యావసర వస్తువులు ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి.

తుఫాను ప్రభావిత ప్రాంతంలో తొలి రోజు అర లీటరు పాలను రూ. 100కి బ్లాక్‌లో విక్రయించిన వ్యాపారులు, ఇప్పుడు సాధారణ ధరకే అందిస్తున్నారు. దీనికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే కారణంగా చెప్పాలి. అందుబాటులో ఉన్న విశాఖ డెయిరీతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సహకార డెయిరీలతో పాటు ప్రైవేటు రంగంలోని డెయిరీల నుంచి దాదాపు 5 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లను తుఫాను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాల ధర సాధారణ స్థితికి దిగివచ్చింది.

ఇక ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు బాధిత ప్రాంతాల్లో 90 శాతం వరకూ సరఫరా అవుతోంది. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ బాధితులకు సహాయం అందడంలో మాత్రం యంత్రాంగం సక్రమంగానే స్పందిస్తోంది. రెండు రోజుల్లో పక్క జిల్లాల నుంచి దాదాపు 6 లక్షల మేర ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. తొలిరోజు పరిస్థితులు మంగళవారం నాటికే చక్కబడినప్పటికీ బుధవారం నాటికి అదుపులోకి వచ్చాయి. తుఫాను అనంతరం నగరంలోని రైతు బజార్లతో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. ఉల్లి, టమోటా, బంగాళాదుంపల ధరలు సాధారణ రోజుల్లో కంటే మూడు రెట్లు ధరలు పెంచేశారు.

అయితే రైతు బజార్లలో కనీస ధరలకు విక్రయించాలని ఆదేశించినప్పటికీ పెద్ద సంఖ్యలో వినియోగదార్లు దుకాణాల వద్ద ఎగబడ్డారు. దీంతో పరిస్థితిపై సిఎం చంద్రబాబు స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. పక్క జిల్లాల నుంచి సుమారు 200 టన్నుల కూరగాయలను నగరానికి తెప్పించి బాధిత కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయడంతో గత్యంతరం లేక ప్రైవేటు మార్కెట్లలో ధరలు తగ్గించాల్సిన పరిస్థితి వ్యాపారులకు ఎదురైంది. ప్రస్తుతం నగరంలో కూరగాయల ధరలు సాధారణ రోజుల్లో కంటే కాస్త తక్కువగానే లభిస్తున్నాయి. అదే విధంగా పెట్రోల్ బంక్‌ల్లో కూడా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. మంచినీరు, విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థ పునరుద్ధరణ తప్పించి మిగిలిన అన్ని అంశాల్లో తుఫాను బాధితులకు ఊరట లభించిందనే చెప్పాలి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

హుధుద్ పెను తుఫాను బాధిత ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

విద్యుత్, నీటి సరఫరా మినహా మిగిలిన విషయాల్లో కొంత కుదుట పడుతోంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నుంచి నగరంలోనే మకాం వేసి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించడంతో అధికారులు సైతం ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. దీంతో వ్యాపారులు, బ్లాక్ మార్కెటీర్ల ఆటలకు అడ్డుకట్ట పడిందనే చెప్పాలి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

తుఫాను అనంతరం ప్రభావిత ప్రాంతాల్లో పెచ్చుమీరిన వ్యాపార ధోరణి ఇప్పుడే తగ్గుముఖం పడుతోంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు ఊరటనిస్తున్నాయి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

పెనుగాలుల బీభత్సం సృష్టించిన తర్వాత సోమవారం నాటి పరిస్థితితో పోలిస్తే బుధవారం నాటికి పాలు, కూరగాయలు, తదితర నిత్యావసర వస్తువులు ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాయి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

తుఫాను ప్రభావిత ప్రాంతంలో తొలి రోజు అర లీటరు పాలను రూ. 100కి బ్లాక్‌లో విక్రయించిన వ్యాపారులు, ఇప్పుడు సాధారణ ధరకే అందిస్తున్నారు. దీనికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే కారణంగా చెప్పాలి.
కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

అందుబాటులో ఉన్న విశాఖ డెయిరీతో పాటు ఇతర జిల్లాలకు చెందిన సహకార డెయిరీలతో పాటు ప్రైవేటు రంగంలోని డెయిరీల నుంచి దాదాపు 5 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లను తుఫాను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాల ధర సాధారణ స్థితికి దిగివచ్చింది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

ఇక ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు బాధిత ప్రాంతాల్లో 90 శాతం వరకూ సరఫరా అవుతోంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ బాధితులకు సహాయం అందడంలో మాత్రం యంత్రాంగం సక్రమంగానే స్పందిస్తోంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

రెండు రోజుల్లో పక్క జిల్లాల నుంచి దాదాపు 6 లక్షల మేర ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. తొలిరోజు పరిస్థితులు మంగళవారం నాటికే చక్కబడినప్పటికీ బుధవారం నాటికి అదుపులోకి వచ్చాయి.

శాంతించిన సాగరం

శాంతించిన సాగరం

తుఫాను అనంతరం నగరంలోని రైతు బజార్లతో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

ఉల్లి, టమోటా, బంగాళాదుంపల ధరలు సాధారణ రోజుల్లో కంటే మూడు రెట్లు ధరలు పెంచేశారు.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

అయితే రైతు బజార్లలో కనీస ధరలకు విక్రయించాలని ఆదేశించినప్పటికీ పెద్ద సంఖ్యలో వినియోగదార్లు దుకాణాల వద్ద ఎగబడ్డారు. దీంతో పరిస్థితిపై సిఎం చంద్రబాబు స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

పక్క జిల్లాల నుంచి సుమారు 200 టన్నుల కూరగాయలను నగరానికి తెప్పించి బాధిత కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయడంతో గత్యంతరం లేక ప్రైవేటు మార్కెట్లలో ధరలు తగ్గించాల్సిన పరిస్థితి వ్యాపారులకు ఎదురైంది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

ప్రస్తుతం నగరంలో కూరగాయల ధరలు సాధారణ రోజుల్లో కంటే కాస్త తక్కువగానే లభిస్తున్నాయి.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

అదే విధంగా పెట్రోల్ బంక్‌ల్లో కూడా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.

కోలుకుంటున్న విశాఖ

కోలుకుంటున్న విశాఖ

మంచినీరు, విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థ పునరుద్ధరణ తప్పించి మిగిలిన అన్ని అంశాల్లో తుఫాను బాధితులకు ఊరట లభించిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+