వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎస్ కు ఎన్జీటీ హెచ్చరిక, తెలంగాణా అధికారులపైనా ఆగ్రహం : ప్రాజెక్ట్ లపై ఫిర్యాదుల ఫలితం !!

|
Google Oneindia TeluguNews

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల రగడలో ఇప్పటికే కేంద్రం జోక్యం చేసుకుంది. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై, తెలంగాణ రాష్ట్రం జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయడం, తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై ఏపీ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అక్రమ ప్రాజెక్ట్ అని అఫిడవిట్ దాఖలు చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాలకు అక్షింతలు వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 చర్యలకు ఆదేశాలు జారీ చేసే వరకు అధికారులలో చలనం రాదా.. పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీ

చర్యలకు ఆదేశాలు జారీ చేసే వరకు అధికారులలో చలనం రాదా.. పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, అటవీ శాఖల వ్యవహారశైలిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పు జరుగుతుంటే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని మండిపడింది. చర్యలకు ఆదేశాలు జారీ చేసే వరకు అధికారులలో చలనం రాదా అంటూ ప్రశ్నించింది. ఇక ఈ అంశంపై నివేదిక అందజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, అటవీ, పర్యావరణ శాఖ లకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పాలమూరు రంగారెడ్డితో పర్యావరణంపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో పాలమూరు రంగారెడ్డితో పర్యావరణంపై ప్రభావం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకం అక్రమమని, అనుమతుల్లేని ఆ ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందని ఇటీవల అఫిడవిట్లను దాఖలు చేసిన ఏపీ, చట్టాలను ఉల్లంఘించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టులు కట్టే హక్కు లేదని ఎన్ జి టి దృష్టికి తీసుకు వెళ్ళింది.

పాలమూరు రంగారెడ్డిని ఆపాలని ఎన్జీటీని కోరిన ఏపీ ప్రభుత్వం

పాలమూరు రంగారెడ్డిని ఆపాలని ఎన్జీటీని కోరిన ఏపీ ప్రభుత్వం

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్ట్ చేపట్టారని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలోని కల్వకుర్తి నెట్టెంపాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుగంగ హంద్రీ-నీవా గాలేరు-నగరి వెలిగొండ మినహా మిగిలిన ఏ ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పై విచారణ ముగిసేదాకా ప్రాజెక్టును ప్రారంభించకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అక్టోబరు 1వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

 రాయల సీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ

రాయల సీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్ జి టి చెన్నై బెంచ్ విచారణ జరుపుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు డిపిఆర్ కోసమే పనులు చేపట్టామని పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కృష్ణా బోర్డు కమిటీ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించి ఎన్జిటీ కి నివేదికను సమర్పించింది. తెలంగాణ రాష్ట్రం చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కృష్ణా బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

అక్రమాలు జరిగాయని తేలితే ఏపీ ప్రభుత్వ సీఎస్ పై చర్యలు తప్పవన్న ఎన్జీటీ

అక్రమాలు జరిగాయని తేలితే ఏపీ ప్రభుత్వ సీఎస్ పై చర్యలు తప్పవన్న ఎన్జీటీ


రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విచారణ జరుపుతున్న ఎన్జిటి ధర్మాసనం అక్రమాలు జరిగాయని నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాజెక్టు పనులకు సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో చేసిన పనులను దాయమని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు .డిపిఆర్ కోసం ఎంత పని చెయ్యాలో ఎక్కడా విధివిధానాలు లేవని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
ఇరు రాష్ట్రాల ఫిర్యాదులు .. రెండు రాష్ట్రాలకు ఎన్జీటీ వార్నింగ్ .. ఈ రగడ ఎక్కడి దాకా వెళ్తుందో

ఇరు రాష్ట్రాల ఫిర్యాదులు .. రెండు రాష్ట్రాలకు ఎన్జీటీ వార్నింగ్ .. ఈ రగడ ఎక్కడి దాకా వెళ్తుందో

రెండు తెలుగు రాష్ట్రాలు వరుసగా ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో ఉల్లంఘనలు జరిగాయని, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని నేషనల్ హరిత ట్రిబ్యునల్ కు ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో విచారణ జరుపుతున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ప్రభుత్వ అధికారుల తీరును ప్రశ్నించింది. సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతా జరుగుతున్నా, రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకున్నా, కోర్టులు పదేపదే తెలుగు రాష్ట్రాల తీరును ప్రశ్నిస్తున్నా, ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా జగన్ సర్కార్, కెసిఆర్ సర్కారులో మాత్రం మార్పు రావడం లేదు. జల వివాదాలను రోజుకొక రచ్చ చేస్తూ వివాదాన్ని మరింత పెంచుతున్నారు తప్పా, పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదనేది తాజా పరిణామాలతో సుస్పష్టంగా తెలుస్తోంది. మరి తెలుగు రాష్ట్రాలలో అక్రమ నిర్మాణాలు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళిన ఈ రగడ ఫలితం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

English summary
As part of the water war, NGT angry on Jagan and KCR govts, over the Palamuru Rangareddy project and Rayalaseema lift irrigation projects, Gave a warning to the authorities on violations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X