సత్తా చూపిస్తాం: యనమల, 'జగన్ ఫ్యామిలీదే డ్రామా'

డ్రామాలు వారివే: రాజేంద్ర ప్రసాద్
తొలి రోజు తొలి సంతకం తొలి పైలు పైన చంద్రబాబు నాయుడు చేస్తే దానిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు అనడం విడ్డూరమని, అసలైన డ్రామా ఆర్టిస్టులు వారే అని టిడిపి నేత రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ కుటుంబానిదే డ్రామాలన్నారు. తల్లి, చెల్లి, బావ, బావమరిది.. ఇలా అందరివీ డ్రామాలే అన్నారు. వారి డ్రామాలను చూసినందువల్లే ప్రజలు వారిని తిరస్కరించి ఇంటికి పంపించారన్నారు.
లోకసభలో గల్లా జయదేవ్
తొలిసారి ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై లోకసభలో వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులు వేరని చెప్పారు. ఏపీకు ప్రస్తుతం లోటు బడ్జెట్ ఉందన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసే వంద స్మార్ట్ సిటీల్లో మొదటిది ఏపీ రాజధాని కావాలని కోరారు. వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించడం వల్ల ఎక్కువ వాటా తెలంగాణకు దక్కిందన్నారు. జలాలకు సంబంధించిన అంశాలను రెండు రాష్ట్రాలు ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నారు.












Click it and Unblock the Notifications