పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవట్లేదు, అందుకే కర్నాటకలో ఓటు వేయవద్దని చెప్పాం: కేఈ
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తాము పట్టించుకోవడం లేదని టీడీపీ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఏపీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని మోడీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఏపీకి మోడీ చాలా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి ఓటు వేయవద్దని కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చినట్లు చెప్పారు. వైసీపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు టీడీపీనే విశ్వసిస్తారన్నారు.

బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి: బీజేపీ మాలతి
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతీరాణి ఆదివారం డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేసిన దీక్షలో బాలకృష్ణ ప్రసంగిస్తూ ప్రధానితో పాటు ఆయన తల్లి, సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.
చవకబారు వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌కు ఉన్న ఖ్యాతిని మంటగలిపారన్నారు. గతంలో వివిధ కేసుల్లో ఇరుక్కొని మానసిక స్థితి సరిగా లేదని బయటపడిన వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications