జగన్ 'హత్య' కుట్ర!?.. మాకు ఆ అవసరం లేదు.. ఇది వైసీపీ కుట్రే!: లింగారెడ్డి

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో అధికార-ప్రతిపక్షాల రాజకీయమంతా జగన్ ఛాంబర్ చుట్టే తిరుగుతోంది. గత వారం జగన్ ఛాంబర్ లీకేజీ అయిన నాటి నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇరు వర్గాలు కలిసి మొత్తానికి జగన్ ఛాంబర్ లీకేజీ ఓ కుట్ర అని తేల్చిపారేశాయి. కుట్ర చేసింది మీరంటే మీరని పేచీకి దిగుతున్నాయి.

తాజాగా టీడీపీ నేత లింగారెడ్డి ఈ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జగన్ ఛాంబర్ లోకి వాననీళ్లు లీకయ్యేలా చేసి, ఆపై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆయన్ను హత్య చేయాలన్న కుట్ర పన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు ఆయన ఇలా బదులిచ్చారు.

we dont need to murder jagan says tdp lingareddy

జగన్ ను హత్య చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అలాంటి అనుమానాలు గనుక ఉంటే.. ముందే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని లింగారెడ్డి ప్రశ్నించారు. జగన్ లాంటి అసమర్థ నేత విపక్షంలో ఉంటేనే తమకు మేలు కలుగుతుందని, అలాంటప్పుడు తామెందుకు ఆయన్ను అడ్డు తొలగించుకుంటామని అన్నారు. జగన్ అడ్డు తొలగించుకునేందుకు వైసీపీ నేతలే కుట్ర పన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు.

ఇక జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ.. తండ్రి మరణించగానే పదవి కోసం శవ రాజకీయాలు చేసిన ఘనత ఆయనదని లింగారెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని, గనులు దక్కలేదన్న అక్కసుతోనే చెవిరెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను, అధికారులను భయపెట్టే సంస్కృతి వైసీపీదేని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leader Lingareddy made some controversial comments on YSRCP President Jagan and his party over the issue of chamber leakage
Please Wait while comments are loading...