• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు రాజీ: పోలవరం సరే, అమరావతి సహా మిగతావాటి సంగతేమిటి?

By Swetha Basvababu
|

హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ నీటి ప్రాజెక్టుగా 'పోలవరం' ప్రకటించిన కేంద్రం దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని ప్రకటించింది. కానీ ఇది మూడేళ్ల క్రితం నాటి మాట. ఇప్పుడు సీన్ మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు అంచనాలు దాటితే తాము ఒక్క పైసా నిధులు కేటాయించలేమని, అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం తేల్చేసింది. అసలు పోలవరం ప్రాజెక్టును మాత్రమే జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించడానికి కారణాలేమిటి? ఏమా కథా?.. ఒకసారి పరిశీలిద్దాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర ప్రదాయనిగా ఉంటుందని భావించి గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మించే ఈ 'పోలవరం' ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అందుకు అయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించినా పరిస్థితులు తారుమారయ్యాయి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందన్న చందంగా 2014 ఎన్నికలకు ముందు, తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

శివరామక్రుష్ణన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ

శివరామక్రుష్ణన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ

తెలంగాణ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణానికి ఐదుగురు ప్రముఖ నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో రాజధాని నిర్మాణానికి అవసరమైన కసరత్తు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, పట్టణాలు, నగరాల్లో పర్యటించింది. ఆయా నగరాల, పట్టణాల, ప్రాంతాల ప్రముఖుల అభిప్రాయాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సమగ్ర వాస్తవిక ద్రుక్పథంతో నివేదిక తయారుచేసింది. కానీ 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి.

సుజనా, నారాయణ సారథ్యంలో కమిటీ

సుజనా, నారాయణ సారథ్యంలో కమిటీ

నిపుణుల కమిటీని నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కనబెట్టేసింది. ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి ఎం నారాయణ తదితరుల ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి మదింపు జరిపింది. చివరకు క్రుష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి' నిర్మాణానికి సిఫారసు చేసింది. చకచకా రైతుల నుంచి పంట పొలాలు స్వాధీనం చేసుకుని రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకున్నది. ఇదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం, రాజధాని నిర్మాణంలో అవకతవకలపై విపక్షాలన్నీ ఆందోళనకు దిగితే కట్టుబట్టలతో తరలి వచ్చిన తమందరి కోసం నూతన రాజధాని నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతుంటే విపక్షాలు గోల చేస్తున్నాయని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు.

అన్నీ ఒకేచోట అయితే ఎలాగన్న కేంద్రమంత్రి వెంకయ్య

అన్నీ ఒకేచోట అయితే ఎలాగన్న కేంద్రమంత్రి వెంకయ్య

ఇదే సమయంలో అమరావతిలో రాష్ట్ర రాజధాని నగరం నిర్మాణంపై కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు తనదపైన శైలిలో స్పందించారు. అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టమని, కేంద్రం తన పరిధిలో ఉన్న మేరకు నిధుల విడుదలకు మాత్రమే పరిమితమవుతుందని తేల్చేశారు. తాజాగా సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం పూర్తి కాగా, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యం పైనా ఆయన తన మనస్సులో మాట బయట పెట్టారు. హైదరాబాద్ నగరంలో మాదిరిగా అన్నీ ఒక్కచోట అయితే ఎలా? అని తన అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలను ఎలా సంత్రుప్తి పరుస్తారని ప్రశ్నించారు.

బాబు ఇలా ఏపీకి పరిమితం

బాబు ఇలా ఏపీకి పరిమితం

తెలంగాణ ఏర్పాటైన ఏడాది కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయాలకు తెర తీశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సహా పలువురు ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు ‘ఓటుకునోటు' కుంభకోణంలో బహిరంగంగా దొరికి పోయారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సారథ్యం వహించినందుకు నెల రోజుల పాటు జైలు పాలయ్యారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉన్నదని తేలింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో ప్రకంపనలు స్రుష్టించింది. దీనిపై ‘ఏసీబీ' కేసు దర్యాప్తు చేపడితే.. ప్రతిగా ఫోన్ ట్యాంప్ కేసును ఆంధ్రప్రదేశ్ ముందుకు తెచ్చింది. ఈ క్రమంలో కేంద్రస్థాయిలో మద్యవర్తిత్వం దరిమిలా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్టానికే పరిమితం అయ్యారు.

ప్రత్యేక హోదా డిమాండ్ పట్టించుకోని బాబు

ప్రత్యేక హోదా డిమాండ్ పట్టించుకోని బాబు

కానీ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు గట్టిగా డిమాండ్ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు మెత్తబడ్డారు. దీనికి ‘ఓటుకు నోటు' కేసు కారణమని రాజకీయ విమర్శకులు అంటుంటారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, అటు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కూడా ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా'పై ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో కేంద్రం కూడా 14వ ఆర్థిక సంఘం సిఫారసుల పేరిట ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవకాశం లేదని ప్యాకేజీ ఇస్తామని వాదన తీసుకొచ్చింది. ఇటీవల తమిళనాడులో ‘జల్లికట్టు' కోసం జరిగిన ఉద్యమం మాదిరిగానే ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు శ్రీకారం చుట్టినా తొలి దశలోనే తుంచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

భవిష్యత్‌పై బీజేపీకి బెంగ

భవిష్యత్‌పై బీజేపీకి బెంగ

మరోవైపు అధికారంలోకి వచ్చి మూడు వసంతాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అందరిలో తదుపరి భవిష్యత్‌పై బెంగ పట్టుకున్నది. ఈ క్రమంలో చంద్రబాబు క్యాబినెట్ విస్తరించారు. తన కొడుక్కి చోటు కల్పించారు. కానీ సొంత పార్టీలో అసమ్మతి మంట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చినందుకు ప్రతిపక్షం నుంచి విమర్శల వేడి.. బేరసారాల వల్ల టీడీపీ మిత్రపక్షంగా బీజేపీకి నష్ట్టం వాటిల్లుతుందన్న బాధతో బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి.. నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

పట్టిసీమపై బాబు ఇలా

పట్టిసీమపై బాబు ఇలా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నీటి పంపిణీ సాగేది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఇష్టారాజ్యంగా సాగే అవకాశాలు లేకపోవడంతో గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి క్రుష్ణా డెల్టాకు నీరు తరలించారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి బదులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై అప్పట్లోనే కేంద్రం నిలదీసిందన్న విమర్శలు ఉన్నాయి. రాజధాని నిర్మాణంలోనూ, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఇష్టారాజ్యంగా ముందుకు సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి చెక్ పెట్టడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆంక్షలు విధించిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీ నేతలు మాత్రం తమ స్వార్థం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం వెనుకడుగు వేస్తారని చెప్తున్నారు.

కేంద్రంపై పోరులో బాబు వెనుకడుగు

కేంద్రంపై పోరులో బాబు వెనుకడుగు

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్నా.. పోలవరం ప్రాజెక్టుకు ముందుగా నిర్ణయించిన అంచనాల మేరకే నిధులు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు గానీ, ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలుగానీ స్పందించక పోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు దాటితే తమ బాధ్యత కాదని కేంద్రం చేసిన ప్రకటనపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. లేదా భవిష్యత్ రాజకీయాల కోసం కేంద్రం మైండ్ గేం ఆడుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

English summary
Union Government cleared to AP government, it will be bare expenditure on Polavaram project only first estimations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X