బాబుకు తలనొప్పి: కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నిర్ణయంపై వీడని ఉత్కంఠ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికకు టిడిపి కసరత్తు చేస్తోంది. కర్నూల్ జిల్లా నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన సమావేశం ఎటూ తేలకుండానే ఆదివారం నాడు ముగిసింది. సోమవారం నాడు కర్నూల్ జిల్లా స్థానికసంస్థల ఎమెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించనున్నట్టు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించారు.

రంగంలోకి కెఈ: సోదరుడికి టిక్కెట్టు కోసమిలా, అభ్యర్ధి లేకుండానే టిడిపి ప్రచారం

కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక టిడిపికి కత్తిమీద సాముగా మారింది. ఆ స్థానం నుండి పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతున్నారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ నెల 2న, కర్నూల్ జిల్లా నేతలకు సూచించారు. కానీ, పార్టీ నేతలు ఏకాభిప్రాయానికి రాలేదు.

కర్నూల్ నేతలకు బాబు షాక్: ఓట్లు తగ్గితే చర్యలు, 23న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక

We will announce MLC candidate for Kurnool on December 25: Somireddy

కర్నూల్ జిల్లా నేతలతో చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని నిర్ణయించలేదు. పోటీ తీవ్రంగా ఉంది. సుమారు ఆరేడుగురు అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

అయితే కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులతో చంద్రబాబునాయుడు డిసెంబర్ 25న, సమావేశం కానున్నారు. అదే రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించనున్నట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We will announce MLC candidate for Kurnool on December 25 said Ap Agriculture minister Somireddy Chandramohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి