• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలవరం పనులతో...చైనా రికార్డు బ్రేక్ చేస్తాం: మంత్రి ఉమ;సిఎం రాక

By Suvarnaraju
|

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణపరంగా మరో రికార్డు సొంతం చేసుకుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో ఒక సరి కొత్త రికార్డు సాధించామన్నారు.

దేశంలోని ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్‌ పనులు జరగలేదని మంత్రి ఉమ చెప్పారు. చైనా త్రీగోర్జెస్‌ డ్యామ్‌లో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయని, జులై నాటికి తాము చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు.

We will break China record with polavaram works: Minister Uma

మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పూర్తైంది. అసాధ్యం అనుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి సుసాధ్యం చేశారు. మొత్తం రెండు సీజన్లలో దీన్ని పూర్తిచేయగలిగారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. అప్పటి నుంచి 412 రోజులు బాగా శ్రమించి రూ.430 కోట్లతో ఈ పనిని పూర్తి చేశారు. సోమవారం ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఏర్పాటు చేసిన ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

ఇదిలా వుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాక సందర్భంగా ఆయన పర్యటన సాఫీగా సాగేందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మావోయిస్టుల బెదిరింపులు,హెచ్చరికల నేపథ్యంలో అధికారులు,రైతులతో సహా అందరినీ తనిఖీ చేసి పాస్‌ ఇచ్చి లోపలకు పంపుతామన్నారు. ఇప్పటికే పోలవరం పరిసరాల్లో ప్రత్యేక పోలీసులు క్యూంబింగ్‌ నిర్వహిస్తున్నారని, సీఆర్‌పీఎఫ్‌ దళాలు ప్రాజెక్టులో మోహరించినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు...

# సోమవారం ఉదయం 10.45గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై హెలీకాఫ్టర్‌ నుంచి దిగుతారు.

# మొదట డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణప్రదేశానికి చేరుకుని త్వరితగతిన పనులు పూర్తి చేసిన సాంకేతిక నిపుణులను సత్కరిస్తారు.

# స్పిల్‌వే నిర్మాణప్రాంతంలో పనులు చూసి స్పిల్‌ఛానల్‌లో కొంత మంది రైతులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు.

# అక్కడ నుంచి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన చీఫ్‌ ఇంజినీర్ల సమావేశంలో పాల్గొంటారు.

# జలవనరుల శాఖాధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు.

# సాయంత్రం 3.30 గంటలకు తిరిగి హెలీకాఫ్టర్‌లో విజయవాడకు బయలుదేరి వెళ్తారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada: Polavaram project has achieve another record of construction, said Minister Devineni Umamaheswar Rao. Speaking to media on Monday, he said, "We have achieved a record of 11,158 cubic meters of concrete works in one day. Minister Uma said that no concrete work has been done in any irrigation project in the country. On the other hand, Chief Minister Chandrababu is visiting the Polavaram Project on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more