వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హైద్రాబాద్‌పై హక్కు తేలుస్తాం, కుర్రాడ్ని తట్టుకోలేక'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తమ హక్కుల పైన న్యాయస్థానాలు, కేంద్రం వద్ద తేల్చుకుంటామని తెలంగాణ ఏపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. కుర్రాడు అయిన రేవంత్ రెడ్డిని తట్టుకోలేక, ఎదుర్కోలేక కేసీఆర్ కిందామీదా పడ్డారన్నారు.

హైదరాబాదును అందరు అభవృద్ధి చేశారని చెప్పారు. ఇక్కడ తమ హక్కుల పైన కేంద్రం, కోర్టులకు వెళ్తామని చెప్పారు. కేసీఆర్ 13 మంది ఎమ్మెల్యేలను ఎలా లోబర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే తెలంగాణకు మిగులు ఆదాయం వచ్చిందన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం చేసిన మంచి ఏమిటో చెప్పాలన్నారు.

We will fight for our right in Hyderabad: Somireddy

ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసు పెట్టడం అనైతికమన్నారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్‌కు లొంగిపోతే పదవులు, లేకుంటే జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు.

కుర్రాడు అయిన రేవంత్ రెడ్డిని కేసీఆర్ తట్టుకోలేకపోయారన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పన్ని ఇరికించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రామకృష్ణ హెగ్డేకు పట్టిన గతే కేసీఆర్‌కు పట్టడం ఖాయమన్నారు.

గవర్నర్ నరసింహన్ పైన కూడా సోమిరెడ్డి మండిపడ్డారు. ఇథర రాష్ట్రాల గవర్నర్‌లు ఎలా వ్యవహరిస్తున్నారో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. దేవుడు కనబడితే చాలు పొర్లు దండాలు పెట్టుకుంటూ, పాలన వ్యవహారాలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

గవర్నర్ దేవుళ్లకు మొక్కుతుంటే కేసీఆర్ ఆయన కనిపిస్తే కాళ్లు మొక్కుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రజలకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను వీరిద్దరు కాలరాస్తున్నారన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా పని చేసి, చట్టాలు తెలిసిన వారైనప్పటికీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తనకున్న అధికారులు ఎందుకు వినియోగించడం లేదన్నారు.

English summary
We will fight for our right in Hyderabad: Somireddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X