Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును సీఎం చేసి తీరుతాం ..పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు; సోషల్ మీడియాలో రచ్చ

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు, శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అవమానానికి కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగి అత్యంత అవమానకరంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని ఆవేదనతో ఏడ్చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు. అత్యంత బాధాకరమైన సంఘటనలలో కూడా ఆయన కన్నీటిని ఆపుకొని ఆ బాధకు ఉపశమనం కలిగే మార్గాలను అన్వేషించి తదనుగుణంగా వ్యవహరిస్తారు.

అలాంటి చంద్రబాబు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడవడంతో తెలుగు తమ్ముళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు. బాబును ఏడ్పించిన వారిపై అంతకు అంత పగ తీర్చుకుంటామని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును సీఎం చేసి తీరుతామని పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

ఎక్కడ చంద్రబాబుకు అవమానం జరిగిందో అక్కడే రారాజుగా : పసుపు ప్రతిజ్ఞ

ఏ సభలో అయితే చంద్రబాబు అవమానించబడ్డారో ఆ సభలో ఆయన్ని రారాజుగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తామని టిడిపి కార్యకర్తలు పసుపు ప్రతిజ్ఞలు చేయడం మొదలుపెట్టారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఈ చాలెంజ్ ని స్వీకరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఒక్కొక్కరుగా చంద్రబాబు కోసం పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. మరో పక్క చంద్రబాబు ఏపీ అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అని, సీఎం అయిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీలో కాలు పెడతానని శపధం చేసి మరీ బయటకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ను సీఎం చేసే దాకా విశ్రమించేది లేదని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.

ఎక్కడైతే చంద్రబాబు గారిని అవమానించారో అక్కడే ఆయన్ని రారాజుగా కూర్చోబెడతాం అని సవాల్ చేస్తున్నారు. మిమ్మల్ని సీఎం చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత మాది అంటూ చంద్రబాబుకు భరోసా ఇస్తున్నారు.

2024లో చంద్రబాబు వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం

ప్రస్తుతం సోషల్ మీడియాలో #CBNiscomingin2024 తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం నా ప్రతిజ్ఞ అంటూ తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న నాయకులు ఒక్కొక్కరుగా పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని తమ అవమానంగా భావిస్తూ టిడిపి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగుతామని చెబుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కాగా చంద్రబాబుకి జరిగిన అవమానం తెలుగు తమ్ముళ్లలో ఆవేశాన్ని రగులుస్తోంది.

చంద్ర విలాపానికి సమాధానం చెప్పాలన్న కసితో తెలుగు తమ్ముళ్ళు

క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు అందరూ బలంగా పని చేస్తే టీడీపీని అధికారంలోకి తీసుకు రావడం పెద్ద విషయం కాదని భావిస్తున్న తెలుగు తమ్ముళ్ళు కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు శపధం నెరవేర్చడానికి రంగంలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఇంత వరకు ఎన్నడూ కన్నీరు పెట్టుకోని చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారణంగా కన్నీరు పెట్టుకోవడం, టిడిపి నేతల నుండి, కార్యకర్తల వరకు ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. చంద్రబాబును అలా చూడటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 2024 ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి, జగన్ ను గద్దె దించి చంద్రబాబుకు పట్టం కడితేనే చంద్ర విలాపానికి సమాధానం దొరికినట్టు అవుతుందని అంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తెలుగు తమ్ముళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ప్రజా క్షేత్రంలోకి వెళ్ళటానికి రెడీ అవుతున్న తెలుగు తమ్ముళ్ళు

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. వైసిపి నేతలను తరిమి కొడతామని, చెప్పులతో కొడతామని, జగన్ కు తగిన బుద్ధి చెబుతామని, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, ఆందోళనలతో వైసిపి నేతల తీరుపై తమ నిరసన గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగి ఆమెను అత్యంత అవమానకర రీతిలో మాట్లాడటాన్ని తప్పు పడుతున్నారు. మీకు తల్లి చెల్లి లేదా? ఇదేనా మీ పెంపకం... ఇదేనా మీ సంస్కారం అంటూ విరుచుకు పడుతున్నారు. ప్రజా క్షేత్రంలోని వెళ్ళటం కోసం సమాయత్తమ అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+